వేసవిలో ఓఆర్ఎస్ ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి హానికరమా?
ABN , Publish Date - May 20 , 2026 | 07:52 AM
వేసవిలో డీహైడ్రేషన్ నుంచి రక్షణ కోసం చాలామంది ఓఆర్ఎస్‌ను ఎక్కువగా తాగుతారు. అయితే, వేసవిలో తరచుగా ఓఆర్ఎస్ తాగడం మంచిదేనా? అవసరానికి మించి తాగితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో చాలామంది డీహైడ్రేషన్ నుంచి రక్షణ కోసం ఓఆర్ఎస్ తాగుతారు. కొంతమంది అయితే రోజంతా ఓఆర్ఎస్ కలిపిన నీటినే తాగడం అలవాటుగా మార్చుకుంటారు. అయితే, అవసరానికి మించి ఓఆర్ఎస్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఓఆర్ఎస్‌లో సోడియం, పొటాషియం, గ్లూకోజ్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరంలో నీరు, లవణాల లోపం వచ్చినప్పుడు వాటిని సమతుల్యం చేసి డీహైడ్రేషన్ నుంచి త్వరగా కోలుకోవడంలో సహాయపడతాయి. ముఖ్యంగా ఎక్కువగా చెమట పట్టినప్పుడు లేదా డీహైడ్రేషన్ వచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుంది.
ఓఆర్ఎస్ ఎవరికి ఉపయోగపడుతుంది?
ఎండలో ఎక్కువసేపు పనిచేసేవారికి
పొలం పనులు చేసే వారికి
పిల్లలు, వృద్ధులకు
డయేరియా వచ్చినప్పుడు
ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ సూచన మేరకు ఓఆర్ఎస్ తీసుకోవడం మంచిది.
ఎక్కువగా తాగితే ఏమవుతుంది?
ఓఆర్ఎస్‌లో చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల దాన్ని తరచుగా తాగితే కొన్ని సమస్యలు రావచ్చు.
రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు.
బీపీ ఉన్నవారికి ఇబ్బంది కలగవచ్చు.
శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతినవచ్చు.
మూత్రపిండాలపై ఒత్తిడి పెరగవచ్చు.
ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, బీపీ, మధుమేహం ఉన్నవారు ఓఆర్ఎస్‌ను వైద్యుల సలహా లేకుండా ఎక్కువగా తాగకూడదు. వేసవిలో సాధారణంగా పుష్కలంగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, తాజా పండ్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ ఉన్నప్పుడు మాత్రమే సరైన మోతాదులో ఓఆర్ఎస్ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
సిగరెట్లు తాగకపోయినా పెదాలు నల్లగా ఉన్నాయా? ఈ చిట్కాలు ట్రై చేయండి
రాగి బాటిల్‌లో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు