మద్యం ఇలా తాగితే చిక్కుల్లో పడ్డట్టే..? చాలా డేంజర్..
ABN , Publish Date - Apr 09 , 2026 | 03:08 PM
మందు తాగేటప్పుడు మద్యం ప్రియులు కొన్ని తప్పులు చేస్తుంటారు. అవి చాలా చిన్నగా అతి సాధారణంగా కనిపించినా.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. మద్యం తాగేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
మందు తాగేటప్పుడు మద్యం ప్రియులు కొన్ని తప్పులు చేస్తుంటారు. అవి చాలా చిన్నగా అతి సాధారణంగా కనిపించినా.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. మద్యం తాగేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
వీకెండ్ వచ్చిందంటే చాలు.. చాలా మంది పార్టీ చేసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. స్నేహితులతో, సన్నిహితులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. మరికొంత మందికి ప్రతిరోజూ మద్యం సేవించే అలవాటు ఉంటుంది. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా.. దానిని చాలా మంది మానలేక పోతుంటారు. కానీ మీరు ఎంత తాగుతున్నారనే దానిపై కంటే.. ఎలా తాగుతున్నారనే దానిపై ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
మందు తాగడం మానలేక పోయినా.. మద్యం తాగే విధానాన్ని మాత్రం మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకు మద్యం ప్రియులకు కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు.
బింజ్ డ్రింకింగ్ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం అంటే..?
తక్కువ సమయంలో అధిక మొత్తంలో మద్యం సేవించడాన్ని బింజ్ డ్రింకింగ్ అంటారు. ఇంకా సోదాహరణగా చెప్పాలంటే.. జస్ట్ రెండు గంటల్లో 5 లేదా అంతకంటే ఎక్కువ గ్లాసుల మద్యం సేవించడం. ఇలా చేయడం అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇలా తాగడం వల్ల కాలేయం.. అసిటాల్డిహైడ్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనిని గ్రూప్1 కార్సినోజెన్‌గా పరిగణిస్తారు. దీని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం అనేక రెట్లు ఉంటుందని చెబుతారు. అంతేకాదు.. తీవ్రమైన తలనొప్పి, వాంతులు, చెమటలు పట్టడంతోపాటు వేగంగా గుండె కొట్టుకోవడం వంటి దుష్ప్రభావాలు కలుగుతాయని వివరిస్తున్నారు.
మద్యం సేవిస్తూ.. సిగిరెట్ తాగితే..
చాలా మందికి మద్యం సేవిస్తూ సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. అలా చేయడం ఆరోగ్యానికి మరింత ప్రమాదకరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాక.. కాలేయంపై మద్యం ప్రభావం చూపిస్తే.. ఊపిరితిత్తులను సిగరెట్లు దెబ్బతీస్తాయి. ఈ రెండు అలవాట్లు శరీరంపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి.
ఖాళీ కడుపుతో మద్యం సేవిస్తే..
కొంత మంది ఖాళీ కడుపుతో మద్యం సేవిస్తారు. అలా చేయడం వల్ల అది నేరుగా రక్తంలో కలిసిపోతుంది. దీనివల్ల మత్తు, దుష్ర్పభావాలు వేగంగా కలుగుతాయి. ఈ నేపథ్యంలో మద్యం సేవించే ముందు లేదా సేవిస్తున్నప్పుడు పోషకాహారం తీసుకోవాల్సి ఉంది. అలా చేయడం వల్ల రక్తంలోకి మద్యం శోషించడం నెమ్మదిస్తుంది. శరీరానికి మద్యం కలిగించే నష్టం కూడా తగ్గుతుంది.
మద్యంలో కూల్‌డ్రింక్ కలిపి తీసుకుంటే..
సాధారణంగా అయితే మద్యంలో కొన్ని నీళ్లు కలిపి సేవిస్తుంటారు. కానీ, కొందరు నీళ్ల కలపకుండా నేరుగా మద్యాన్ని తాగేస్తుంటారు. మరికొందరు మద్యంలో కూల్ డ్రింక్స్ కలిపి తాగేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అధిక మోతాదులో ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల శరీరంలోని అసిటాల్డిహైడ్ స్థాయి పెరిగి.. ఆ మరుసటి రోజు చాలా అలసటగా ఉంటుంది.
మద్యపానం ఆరోగ్యానికి హానీకరం అని అందరికీ తెలుసు. అందుకే.. మద్యం తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే మద్యపానం వలన భవిష్యత్‌లో వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి కొంతలో కొంతైనా బయటపడొచ్చు.
(గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో లభించిన నివేదికలు, సమాచారం ఆధారంగా రూపొందించారు. దీనితో ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఎలాంటి సంబంధం లేదు. ఆంధ్రజ్యోతి ఏ విధంగానూ బాధ్యత వహించదు)
ఈ వార్తలు కూడా చదవండి..
జాగ్రత్త.. కరివేపాకు అందరికీ మంచిది కాదు..!
చియా గింజలు ఎప్పుడు తింటే బరువు తగ్గుతారు?
For More Health News And Telugu News