Share News

అస్సాం, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. ఎన్డీఏకు మంత్రి లోకేశ్ అభినందనలు..

ABN , Publish Date - May 04 , 2026 | 05:02 PM

అస్సాం, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఎన్నికల్లో ఎన్డీఏకు లభించిన విజయాన్ని స్వాగతిస్తూ లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.

అస్సాం, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. ఎన్డీఏకు మంత్రి లోకేశ్ అభినందనలు..
Minister Nara Lokesh

అమరావతి: అస్సాం, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఎన్నికల్లో ఎన్డీఏకు లభించిన విజయాన్ని స్వాగతిస్తూ లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టి ఎన్డీఏకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వచ్చిన ఎన్నికల ఫలితాలు అభివృద్ధి, స్థిరత్వం, నిర్ణయాత్మక నాయకత్వంపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.


దేశవ్యాప్తంగా ప్రజలు అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని కోరుకుంటున్నారని మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం వేగం, విస్తృత స్థాయి, పారదర్శకతతో కూడిన అభివృద్ధి వైపు సాగుతోందని వెల్లడించారు. ఈ ఎన్నికల ఫలితాలు ఆ దిశగా ప్రజల మద్దతును మరింత బలపరిచాయని చెప్పారు. అభివృద్ధి, అవకాశాలు, సమగ్ర ప్రగతి లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారతదేశానికి బలమైన మద్దతుగా ఈ తీర్పు నిలిచిందని మంత్రి లోకేశ్ అన్నారు.


మరోవైపు తమిళనాడు ఎన్నికల్లో విజయం వైపు దూసుకెళ్తున్న టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు కూడా మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. 'తమిళనాడులో అద్భుతమైన తొలి ఎన్నికల విజయం సాధించిన విజయ్‌కు అభినందనలు. ఈ ఫలితం రాష్ట్ర ఓటర్ల మారుతున్న ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, దాని రాజకీయ ముఖచిత్రానికి ఒక కొత్త కోణాన్ని అందిస్తోంది. ఆయన ప్రజా జీవితంలోకి అడుగుపెడుతూ బాధ్యత, నిబద్ధతతో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అంటూ పోస్టు పెట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి

విజయ్‌కు మెజారిటీ తగ్గితే.. కలిసొచ్చే పార్టీలు ఇవేనా

మూడు రాష్ట్రాల్లో విజయం దిశగా బీజేపీ.. అంబరాన్ని అంటుతున్న సంబరాలు..

Updated Date - May 04 , 2026 | 05:11 PM