టీజీపీఎస్సీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్
ABN , Publish Date - Jun 02 , 2026 | 07:01 PM
నిరుద్యోగ యువతకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) శుభవార్త చెప్పింది. రోడ్లు, భవనాల (R&B) శాఖలో ఖాళీగా ఉన్న 222 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మరో కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా మారనుంది. రోడ్లు, భవనాల (R&B) శాఖలో మొత్తం 222 ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టులు, 19 ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి జూన్ 18 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.
AEE పోస్టులకు జూలై 13 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టులకు జూలై 15 వరకు గడువు కల్పించారు. అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, వయోపరిమితి, ఇతర నిబంధనలను పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
నియామక ప్రక్రియలో భాగంగా రాత పరీక్షలను ఆగస్టు 10 నుంచి 17 వరకు నిర్వహించనున్నారు. పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులను తుది ఎంపికకు పరిగణలోకి తీసుకుంటారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు TGPSC అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాలని సూచిస్తున్నారు.
Also Read:
ట్రైన్‌లో లగేజీ పోతే ఏం చేయాలో తెలుసా?
కుర్చీపై బట్టలు వేస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
For More Latest News