జనసేన కాదు.. బీజేపీ ‘భజనసేన’: సామ రామ్మోహన్
ABN , Publish Date - Jun 02 , 2026 | 06:37 PM
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రెస్‌మీట్‌లో పవన్ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రెస్‌మీట్‌లో పవన్ చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ద్వంద్వ వైఖరిని అద్దం పడుతున్నాయని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌వేదికగా పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కల్యాణ్‌ది ‘జనసేన’ పార్టీ అని.. తెలంగాణలో బీజేపీ ‘భజన సేన’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణలో నిరుద్యోగంపై కొట్లాడుతానని అన్న పవన్ కల్యాణ్‌కి.. కేంద్ర ప్రభుత్వం కారణంగా పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, పేపర్ లీక్ ఘటనలు కనిపించడం లేదా? అని నిలదీశారు. ఒకవేళ కనిపించినా నిలబడి కొట్లాడటానికి కాళ్ళు లేవట్లేవా?? అంటూ ఘాటుగా స్పందించారు. పవన్ ద్వంద్వ వైఖరికి ఎందుకని ప్రశ్నించారు. ‘ఇది తెలంగాణ జాతి.. అమ్మలా ఆదరించడం తెలుసు.. తెలంగాణలో కుట్రలు చేస్తే అమ్మోరులా దహించడమూ తెలుసు’ అంటూ పవన్‌ను హెచ్చరిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు సామ.