Share News

తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల జాగీరు.. నీ అయ్యా జాగీరు కాదు: పొన్నం

ABN , Publish Date - Jun 02 , 2026 | 06:21 PM

తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల జాగీరు.. నీ అయ్యా జాగీరు కాదంటూ జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.

తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల జాగీరు.. నీ అయ్యా జాగీరు కాదు: పొన్నం

హైదరాబాద్, జూన్02: తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల జాగీరు.. నీ అయ్యా జాగీరు కాదంటూ జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లో జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీభవన్‌ వేదికగా స్పందించారు.

మిస్టర్ పవన్ కళ్యాణ్.. ఇది మా అయ్యా జాగీరే అని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ ఇక్కడికి వచ్చి పీకేదేంటీ? అని ఆయన ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్ అని అభివర్ణించారు. తన దగ్గర డబ్బులు ఉంటే తాను కూడా పవన్‌తో ఒక క్యారెక్టర్ చేయిస్తానన్నారు. తెలంగాణపై పవన్ కళ్యాణ్ మరోసారి అక్కసు వెళ్లగక్కారంటూ మండిపడ్డారు.


తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తి పవన్ అని తెలిపారు. గద్దర్‌కు కారు కొనిచ్చా అని చెప్పినందుకు ముందు క్షమాపణ చెప్పాలంటూ పవన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. చనిపోయిన వారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అని ఏపీ డిప్యూటీ సీఎంను ఆయన సూటిగా ప్రశ్నించారు. తనకి ఆంధ్రాలోనే దిక్కు లేదని పవన్ చెప్పుకున్నాడని వ్యంగ్యంగా అన్నారు. ఉద్యమ సమయంలో కూడా ఆంధ్రా వాళ్ళని మేం ఏం అనలేదని పేర్కొన్నారు. మేం ఆంధ్రా వాళ్ళని ఏదో అన్నట్టు పవన్ కల్యాణ్ అబద్ధాలు చెబుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


పార్లమెంటులో ఏ బిల్లు చేసినా తలుపులు మూసే పాస్ చేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. కొండగట్టుకు ఇచ్చిన పైసలు మీ అయ్యా జాగీరా? అని సందేహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టడం గెలకడం కాదా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తిరిగితే జనాలు వస్తారు కానీ ఓట్లు వేయరని ఎద్దేవా చేశారు.

పవన్ కళ్యాణ్ వచ్చినా, పోయినా మాకేం సంబంధం లేదన్నారు. తెలంగాణ ఎప్పుడైనా ఏపీ ప్రజలను స్వాగతిస్తూనే ఉంటుందని చెప్పారు. సినిమా నటుడిగా పవన్ ఎక్కడ తిరిగినా తమకేం ఇబ్బంది లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది: పవన్ కల్యాణ్

తెలంగాణ పోరాట స్ఫూర్తితో ఉత్తేజం పొందాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 02 , 2026 | 06:36 PM