Share News

తెలంగాణ పోలీస్ శాఖలో భారీ రిక్రూట్‌మెంట్.. 7,437 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ABN , Publish Date - Jul 29 , 2026 | 07:56 PM

తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ పోలీస్ నియామక మండలి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది

తెలంగాణ పోలీస్ శాఖలో భారీ రిక్రూట్‌మెంట్.. 7,437 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్, జులై 29: తెలంగాణ పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ పోలీస్ నియామక మండలి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటి ద్వారా సివిల్, ఏఆర్, స్పెషల్ పోలీస్, ఫైర్, జైళ్ల శాఖలో ఖాళీగా ఉన్న దాదాపు 7,437 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఈ ఆన్‌లైన్ దరఖాస్తుల తేదీలను త్వరలో పోలీస్ నియామక మండలి ప్రకటించనుంది. దరఖాస్తుకు ముందు వైద్య, శారీరక ప్రమాణాలు పరిశీలించుకోవాలని అభ్యర్థులకు సూచించింది.


  • కానిస్టేబుల్ (సివిల్) 3,697; కానిస్టేబుల్ (ఏఆర్) 1,052 పోస్టులు

  • స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ఎస్సై 44, కానిస్టేబుల్ 1,380 పోస్టులు

  • అగ్నిమాపక శాఖలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39, ఫైర్ ఫైటర్ 751 పోస్టులు

  • జైళ్ల శాఖలో 223 పోస్టులను భర్తీ చేయనున్నారు.

గమనిక: మరిన్ని వివరాల కోసం అఫీషియల్ వెబ్‌సైట్‌ https://www.tgprb.in/ను సందర్శించండి.


ఈ వార్తలు కూడా చదవండి..

టబ్‌లో పిల్లలు.. మెడలోతు నీటిలో తండ్రి పోరాటం.. వీడియో వైరల్

చిన్నారి విన్యాసాలు.. సైనికుల ఫిదా.. వీడియో వైరల్

For More TG News And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 09:05 PM