Share News

నీట్ యూజీ 2026 విద్యార్థులకు అలర్ట్.. రీఫండ్ కోసం వెంటనే ఇలా దరఖాస్తు చేయండి

ABN , Publish Date - May 23 , 2026 | 11:16 AM

నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ ప్రక్రియను ఎన్‌టీఏ ప్రారంభించింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించి రీఫండ్ పొందవచ్చని తెలిపింది.

నీట్ యూజీ 2026 విద్యార్థులకు అలర్ట్.. రీఫండ్ కోసం వెంటనే ఇలా దరఖాస్తు చేయండి
NEET UG 2026 Fee Refund

ఇంటర్నెట్ డెస్క్: నీట్ (National Eligibility cum Entrance Test) యూజీ (Undergraduate) 2026 ఫీజు రీఫండ్ కోసం ఎన్‌టీఏ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in లోకి వెళ్లి రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించడానికి మే 27ను చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు తమ నీట్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి రీఫండ్ లింక్‌పై క్లిక్ చేసి బ్యాంక్ వివరాలు నమోదు చేయాలి. ఇందులో ఖాతాదారుడి పేరు, ఖాతా సంఖ్య, IFSC కోడ్, బ్యాంక్ పేరు వంటి వివరాలు ఇవ్వాలి. అవసరమైతే రద్దు చేసిన చెక్ కాపీని కూడా అప్లోడ్ చేయవచ్చు.


మరోవైపు, రద్దైన నీట్ పరీక్షను జూన్ 21న తిరిగి నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. ఇప్పటికే నమోదు చేసుకున్న విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, అదనపు పరీక్ష ఫీజు కూడా ఉండదని స్పష్టం చేసింది.


రీ-నీట్ అడ్మిట్ కార్డులను ఎన్‌టీఏ జూన్ 14 నాటికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in లోకి వెళ్లి ‘రీ-నీట్ హాల్ టికెట్’ లింక్‌పై క్లిక్ చేయాలి. అనంతరం అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి హాల్ టికెట్‌ను PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. రీ-నీట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని ఎన్‌టీఏ తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి...

ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్రాత్మక రికార్డ్: మంత్రి ఉత్తమ్

కేజీ బేసిన్ గ్యాస్ వివాదం.. రిలయన్స్‌కు సుప్రీంకోర్టులో షాక్

Read Latest Telugu News

Updated Date - May 23 , 2026 | 11:22 AM