Share News

రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాలు..

ABN , Publish Date - Jul 04 , 2026 | 06:11 PM

రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్. దేశవ్యాప్తంగా 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది.

రైల్వేలో 6,565 టెక్నీషియన్ ఉద్యోగాలు..
RRB Technician Recruitment 2026

ఇంటర్నెట్ డెస్క్: రైల్వే శాఖలో ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBs) మొత్తం 6,565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (RRB Technician Recruitment 2026) విడుదల చేశాయి. ఇందులో సికింద్రాబాద్ రైల్వే జోన్‌కు 399 ఖాళీలు కేటాయించారు. అర్హత కలిగిన అభ్యర్థులు జులై 29, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


ఖాళీల వివరాలు

ఈ నియామక ప్రక్రియలో రెండు విభాగాల కింద పోస్టులను భర్తీ చేయనున్నారు.

  • టెక్నీషియన్ గ్రేడ్-I (సిగ్నల్) – 323 పోస్టులు

  • టెక్నీషియన్ గ్రేడ్-III – 6,242 పోస్టులు

  • మొత్తం ఖాళీలు: 6,565

సికింద్రాబాద్ జోన్‌లో పోస్టులు

  • టెక్నీషియన్ గ్రేడ్-I (సిగ్నల్) – 4

  • టెక్నీషియన్ గ్రేడ్-III – 395

  • మొత్తం: 399 పోస్టులు

ఈ నియామకాలు దేశవ్యాప్తంగా ఉన్న 21 రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ప్రాంతాల్లో చేపట్టనున్నారు.

విద్యార్హత

పోస్టును బట్టి అభ్యర్థులు పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ లేదా సంబంధిత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ప్రతి పోస్టుకు అవసరమైన అర్హతల వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉన్నాయి.


వయోపరిమితి

టెక్నీషియన్ గ్రేడ్-I (సిగ్నల్):

  • కనిష్ఠ వయస్సు – 18 సంవత్సరాలు

  • గరిష్ఠ వయస్సు – 33 సంవత్సరాలు

టెక్నీషియన్ గ్రేడ్-III:

  • కనిష్ఠ వయస్సు – 18 సంవత్సరాలు

  • గరిష్ఠ వయస్సు – 30 సంవత్సరాలు

వయస్సును 2026 జులై 1 నాటికి పరిగణనలోకి తీసుకుంటారు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం.. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది.

వేతనం

  • టెక్నీషియన్ గ్రేడ్-I (సిగ్నల్): నెలకు ప్రారంభ వేతనం రూ.29,200

  • టెక్నీషియన్ గ్రేడ్-III: నెలకు ప్రారంభ వేతనం రూ.19,900

దరఖాస్తు ఫీజు

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ.500

  • ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మాజీ సైనికులు, ట్రాన్స్‌జెండర్‌లు, మైనారిటీలు – రూ.250

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపికను ఈ దశల ద్వారా నిర్వహిస్తారు.

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)

  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

  • మెడికల్ పరీక్ష

పరీక్ష విధానం

టెక్నీషియన్ గ్రేడ్-I (సిగ్నల్):

మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం, గణితం, బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 90 నిమిషాలు.

టెక్నీషియన్ గ్రేడ్-III:

ఈ పరీక్ష కూడా 100 మార్కులకు ఉంటుంది. గణితం, జనరల్ సైన్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తులకు చివరి తేదీ: జులై 29, 2026

అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, తమ అర్హతలను పరిశీలించి అప్లై చేయడం మంచిది.


Also Read:

తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి నెల నెలా ఎంత ముడుతోంది: మంత్రి దుర్గేష్‌

జీలకర్ర మంచిదో కాదో.. ఇలా సింపుల్‌గా తెలుసుకోండి

Updated Date - Jul 04 , 2026 | 06:11 PM