Share News

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 పోస్టులకు నోటిఫికేషన్

ABN , Publish Date - Aug 24 , 2026 | 04:36 PM

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 పోస్టులకు నోటిఫికేషన్
BOB LBO Recruitment 2026

ఇంటర్నెట్ డెస్క్: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా మంచి అవకాశం కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి బ్యాంక్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నియామకాల్లో తెలుగు రాష్ట్రాలకు కూడా పోస్టులు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌లో 80 పోస్టులు, తెలంగాణలో 50 పోస్టులు ఉన్నాయి. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 130 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 7 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.


పోస్టుల వివరాలు

  • పోస్టు పేరు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO)

  • మొత్తం ఖాళీలు: 2,482

  • తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు

  • ఆంధ్రప్రదేశ్: 80 పోస్టులు

  • తెలంగాణ: 50 పోస్టులు

  • మొత్తం: 130 పోస్టులు

విద్యార్హత

  • లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

  • అదనంగా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో కనీసం ఒక సంవత్సరం పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.

  • అభ్యర్థి ఏ రాష్ట్రానికి దరఖాస్తు చేస్తున్నారో ఆ రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం తెలిసి ఉండాలి.


వయోపరిమితి

  • 2026 ఆగస్టు 1 నాటికి అభ్యర్థుల వయసు కనీసం 21 సంవత్సరాలు, గరిష్ఠంగా 30 సంవత్సరాలు ఉండాలి.

  • రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ఠంగా 15 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.


జీతం ఎంత?

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు ప్రాథమిక వేతనం లభిస్తుంది. దీనికి అదనంగా బ్యాంకు నిబంధనల ప్రకారం వివిధ అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు అందుతాయి.

దరఖాస్తు ఫీజు

దరఖాస్తు ఫీజును కేటగిరీల వారీగా నిర్ణయించారు.

  • జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్: రూ.850

  • ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్‌ఎం/మహిళా అభ్యర్థులు: రూ.175

ఎంపిక ప్రక్రియ

  • ఈ నియామక ప్రక్రియలో ముందుగా ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులను తదుపరి దశలకు ఎంపిక చేస్తారు.

  • షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటి ఆధారంగా తుది ఎంపిక జాబితాను రూపొందిస్తారు.


ఆన్‌లైన్ పరీక్ష ఎలా ఉంటుంది?

కంప్యూటర్ ఆధారిత పరీక్ష మొత్తం 120 మార్కులకు ఉంటుంది. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.

ప్రశ్నలు నాలుగు విభాగాల నుంచి వస్తాయి:

  • ఇంగ్లీష్ లాంగ్వేజ్ – 30 ప్రశ్నలు

  • బ్యాంకింగ్ నాలెడ్జ్ – 30 ప్రశ్నలు

  • జనరల్/ఎకనామిక్ అవేర్‌నెస్ – 30 ప్రశ్నలు

  • రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ – 30 ప్రశ్నలు

  • పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున తగ్గిస్తారు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: ఆగస్టు 18, 2026

  • దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: సెప్టెంబర్ 7, 2026

అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవడం మంచిది. దరఖాస్తు చేయడానికి ముందు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక నియామక నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, నిబంధనలు, రాష్ట్రాల వారీ ఖాళీల వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి.


Also Read:

ఫ్లూ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆయుర్వేద పానీయాలు తీసుకోండి

ఏఐతో డ్రైవర్లపై వేటు.. ఉబెర్‌పై రూ.9,224 కోట్ల జరిమానా!

Updated Date - Aug 24 , 2026 | 05:17 PM