Share News

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు రాత పరీక్ష తప్పనిసరి

ABN , Publish Date - Sep 17 , 2026 | 04:00 PM

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమలు చేస్తున్న మెరిట్‌ ఆధారిత వెయిటేజ్‌ విధానానికి బదులుగా రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది.

 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు రాత పరీక్ష తప్పనిసరి
APPSC Veterinary Assistant Surgeon

అమరావతి: రాష్ట్రంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీ (APPSC) ద్వారా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సుదీర్ఘకాలంగా అమలు చేస్తున్న మెరిట్‌ ఆధారిత వెయిటేజ్‌ విధానానికి బదులుగా రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.


వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల నియామక ప్రక్రియను మెరిట్‌ ఆధారంగా చేపట్టాలని ఈ నెల 13, 14 తేదీల్లో జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో రాత పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టేలా తాజా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపికలో రాత పరీక్ష కీలకంగా మారనుంది.

Also Read:

ఏడాది తర్వాత డీఎస్సీలో అక్రమాలంటూ మాట్లాడుతారా.. వైసీపీపై అనిత ఫైర్

ప్రధాని మోదీ నిర్ణయాలతో మరింత అభివృద్ధి చెందనున్న భారత్: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 17 , 2026 | 04:00 PM