వారఫలాలు.. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Apr 19 , 2026 | 08:02 AM
అనుగ్రహం, 19 - 25 ఏప్రిల్ 2026, పి.ప్రసూనా రామన్ వారఫలాలు.. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే..
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఏ విషయాన్నీ సమస్యగా భావించ వద్దు. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయం నిరాశాజనకం. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఇంటి విషయాలపై శ్రద్థ వహించండి. కీలక పత్రాలు అందుకుంటారు. సన్నిహితులతో సంభాషిస్తుంటారు. ఫోన్ సందేశాలు విశ్వసించవద్దు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
అన్నివిధాలా అనుకూలం. ప్రతీ విషయంలోనూ చురుకుగా ఉంటారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ప్రము ఖులకు చేరువవుతారు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. మొండిగా ముందుకు సాగుతారు. పనులు సానుకూలమవుతాయి. రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పిల్లలపై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. కుటుంబసౌఖ్యం పొందుతారు. ఆహ్వానం అందుకుంటారు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. మీ నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యమవుతుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. నిలిచిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. ఆదాయం బాగుంటుంది. ఆప్తులకు సాయం చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆసక్తికరమైన విషయం తెలుసుకుంటారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ప్రతీ విషయం స్వయంగా తెలుసుకోండి.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
కొత్త యత్నాలను చేపడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు సిద్థంగా ఉంటాయి. పెద్దమొత్తం సాయం తగదు. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తుంటారు. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. కొత్తవ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఎవరినీ అతిగా నమ్మవద్దు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసు కోండి. ఖర్చులు తగ్గించుకుంటారు. వాయిదాల చెల్లింపుల్లో అలసత్వం తగదు. చిన్న విషయానికే చికాకుపడతారు. మీ కోప తాపాలు అదుపులో ఉంచుకోండి. అనుకోని సంఘటన ఎదురవుతుంది. పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణుగుతుంది.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
లావాదేవీల్లో మెలకువగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. సంప్రదింపులు వాయిదా వేసుకోవటం శ్రేయస్కరం. అనుభవజ్ఞులను సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. మొండి ధైర్యంతో ముందుకు సాగుతారు. ధన సమస్య ఎదురవుతుంది. సాయం చేసేందుకు అయినవారే సందేహిస్తారు. పిల్లల ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. పనులు అనుకున్న విధంగా పూర్తిచేస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. గృహం సందడిగా ఉంటుంది. సంస్థల స్థాపనలకు రుణాలు మంజూరవుతాయి. కొత్తవ్యక్తులతో మితంగా సంభాషించండి. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
సంప్రదింపులతో తీరిక ఉండదు. శ్రమించినా ఫలితం శూన్యం. మొండిగా వ్యవహరిస్తారు. మీ మాటే నెగ్గాలన్న పంతం తగదు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇంటి విషయాలపై దృష్టి పెట్టండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది.ఆధ్యాత్మికత పెంపొందుతుంది.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
మీ కష్టం త్వరలో ఫలిస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. పట్టుదలతో శ్రమించండి. అవకాశం చేజారిపోతుంది. ఇదీ ఒకందుకు మంచికేనని భావించండి. త్వరలో మంచి అవకాశాలు లభిస్తాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్థాంతరంగా ముగిస్తారు. పిల్లల ఉన్నత చదువులపై దృష్టి పెట్టండి. ప్రతీ విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆహ్వానం అందుకుంటారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
కార్యసిద్ధి, వాహనసౌఖ్యం ఉన్నాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ఖర్చులు విపరీతం. పనులు సానుకూలమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. అవివాహితులకు శుభయోగం. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. పిల్లల అత్యుత్సాహం కట్టడి చేయండి. నోటీసులు అందుకుంటారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
సర్వత్రా శుభయోగం. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. మొండిబాకీలు వసూలవుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. కొత్త సమస్య ఎదురయ్యే ఆస్కారం ఉంది. ఎదుటివారి తీరును గమనించి మెలగండి.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తిచేస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. చిన్న విషయానికే చికాకుపడతారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News