Share News

అమ్మాయిలపై వల.. స్నాప్‌చాట్‌లో అశ్లీల వీడియోలు

ABN , Publish Date - Apr 19 , 2026 | 06:00 AM

అమ్మాయిలపై వల వేసి, వారి అశ్లీల వీడియోలు, ఫొటోలను స్నాప్‌చాట్‌లో పోస్టు చేస్తున్న ముఠాను మహారాష్ట్రలోని అమరావతిలో పోలీసులు...

అమ్మాయిలపై వల.. స్నాప్‌చాట్‌లో అశ్లీల వీడియోలు

  • మహారాష్ట్రలో బయటపడ్డ రాకెట్‌

  • 10 మంది అరెస్టు.. 41 ఖాతాలు రద్దు

  • నిందితులంతా 26 ఏళ్ల లోపు కుర్రాళ్లే

ముంబై, ఏప్రిల్‌ 17: అమ్మాయిలపై వల వేసి, వారి అశ్లీల వీడియోలు, ఫొటోలను స్నాప్‌చాట్‌లో పోస్టు చేస్తున్న ముఠాను మహారాష్ట్రలోని అమరావతిలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు తన ఫోన్‌ను ఓ పాన్‌షాపులో మరిచిపోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితు డు అయాన్‌ అహ్మద్‌ సహా పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సోషల్‌ మీడియాలో వీడియోలు, ఫొటోలు పోస్టు చేస్తూ లైంగికపరమైన నేరాలకు పాల్పడుతున్నట్టు తేల్చారు. అలా గుర్తించిన వాటిలో 41 ఖాతాలను రద్దుచేయించారు. కస్టడీలో పోలీసులకు అయాన్‌ తెలిపిన వివరాలు దిగ్ర్భాంతి కలిగించేలా ఉన్నాయి. ఆ ముఠా బృందాలుగా ఏర్పడి అమ్మాయిల అశ్లీల చిత్రాలను తీసి, బెదిరించి డబ్బులు గుంజడాన్ని వృత్తిగా మార్చుకున్నారు. ఈ బృందంలోని మిగతా నిందితులను ఉజైర్‌ ఇక్బాల్‌ ఖాన్‌, మొహమ్మద్‌ సాద్‌, ఇఫాజ్‌ ఖాన్‌, తబ్రేజ్‌ ఖాన్‌ తస్లీమ్‌ ఖాన్‌, అయిఫాజ్‌ ఖాన్‌ మనీర్‌ ఖాన్‌, మొహమ్మద్‌ ఇమ్రాన్‌ మొహమ్మద్‌ సాజీద్‌, షేక్‌ నవీద్‌ షేక్‌ హసన్‌గా గుర్తించారు. వీరంతా 19-26 ఏళ్ల లోపువారే. పోలీసుల కథనం ప్రకారం, ఈ వ్యవహారం అయాన్‌తో మొదలైంది. సోషల్‌ మీడియా ద్వారా అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని ఇతడు డబ్బులు సంపాదించేవాడు. దీనికోసం అమరావతిలో ఫ్లాట్‌ అద్దెకు తీసుకున్నాడు. అతని స్నేహితుడు ఉజైర్‌ ఖాన్‌. ఒకసారి అయాన్‌ తన ఫోన్‌ను పాన్‌ షాపులో మరిచిపోయాడు. ఆ ఫోన్‌ను గమనించాడు ఉజైర్‌. తన స్నేహితుడి ఫోన్‌ కావడంతో, లాక్‌ కోడ్‌ తీసి చూశాడు. ఆ ఫోన్‌లో కనిపించిన అమ్మాయిల అశ్లీల వీడియోలు, ఫొటోలను తన ఫోన్‌లోకి కాపీ చేసుకున్నాడు. అప్పటినుంచి ఆ స్నేహితులిద్దరూ బద్ధ విరోధులుగా మారి, వేర్వేరుగా రాకెట్‌ను నిర్వహించడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న ఇఫాజ్‌ ఖాన్‌ తన స్నేహితుడు ఉజైర్‌ ఫోన్‌ను ఎట్టకేలకు సంపాదించి.. వాటిలోని వీడియోలను, ఫొటోలను తన మిత్రులు మొహమ్మద్‌ ఇమ్రాన్‌, షేక్‌ నవీద్‌లకు షేర్‌ చేశాడు. ఇక.. ఉజైర్‌ కూడా తన మిత్రులు తబ్రేజ్‌, సాద్‌లతో వాటిని పంచుకున్నాడు. వీరంతా సోషల్‌ మీడియాలో ఆ ఫొటోలను, వీడియోలను పోస్టు చేశారు. దీనితో అమరావతిలో గగ్గోలు రేగింది.

ఈ వార్తలు కూడా చదవండి...

చెవిరెడ్డి కుటుంబ అవినీతి మెుత్తాన్నీ త్వరలో బయటపెడతాం.. పులివర్తి నాని వార్నింగ్

ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్

Updated Date - Apr 19 , 2026 | 06:00 AM