Share News

వారఫలాలు.. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Apr 12 , 2026 | 09:48 AM

అనుగ్రహం, 12 - 18 ఏప్రిల్‌ 2026, పి.ప్రసూనా రామన్‌, వారఫలాలు.. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే..

వారఫలాలు.. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే..

అనుగ్రహం

12 - 18 ఏప్రిల్‌ 2026

పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి,

కృత్తిక 1వ పాదం

mesham.jpgకార్యసాధనకు మరింత శ్రమించాలి. ఓర్పుతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. ఆశావహదృక్పథంతో మెలగండి. దుబారా ఖర్చులు విపరీతం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు. పనులు పురమాయించవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. ఫోన్‌ సందేశాలు పట్టించుకోవద్దు. చిన్ననాటి పరిచయస్తులతో సంభాషిస్తారు.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి,

మృగశిర 1,2 పాదాలు

vrushabham.jpgలక్ష్యం నెరవేరుతుంది. పనులు సానుకూలమవుతాయి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయులతో సంభాషి స్తుంటారు. ముఖ్యమైన పత్రాలు అందు తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభి స్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెల గండి. దూరపు బంధుత్వాలు బలపడతాయి. అందరితో కలుపుగోలుగా మెలుగుతారు.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర,

పునర్వసు 1,2,3 పాదాలు

mithunam.jpgగ్రహసంచారం అనుకూలంగా ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలపడుతుంది. దళా రులతో అప్రమత్తంగా ఉండాలి. చెల్లింపుల్లో జాగ్రత్త. కొత్త పనులు చేపడతారు. ఒక సం బంధం కుదిరే సూచనలున్నాయి. మీ ఇష్టాయి ష్టాలను స్పష్టంగా తెలియజేయండి. మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు. పెద్దల జోక్యంతో వివాదం సద్దుమణుగుతుంది. పుణ్యక్షేత్రం సందర్శిస్తారు.


కర్కాటకం

పునర్వసు 4వ

పాదం, పుష్యమి, ఆశ్లేష

karkatakam.jpgధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారు. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు త్వరితగతిన సాగుతాయి. శుభకార్యం నిశ్చయ మవుతుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. అప్రమత్తంగా ఉండాలి.


సింహం

మఖ, పుబ్బ,

ఉత్తర 1వ పాదం

simham.jpgమీ సహనానికి పరీక్షా సమయం. ఆచితూచి అడుగేయాలి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. చాటు మాటు వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అసం పూర్తిగా ముగిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణంలో జాగ్రత్త.


కన్య

ఉత్తర 2,3,4; హస్త,

చిత్త 1,2 పాదాలు

kanya.jpgప్రతికూలతలతో సతమతమ వుతారు శ్రమించినా ఫలితం ఉండదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు.


తుల

చిత్త 3,4; స్వాతి,

విశాఖ 1,2,3 పాదాలు

tula.jpgసంప్రదింపులు ఫలిస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. సము చిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. వాహనం అమర్చుకోవా లనే కోరిక నెరవేరుతుంది. పనుల ప్రారం భంలో ఆటంకాలు ఎదురవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. పిల్లల ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. ప్రకటనలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. గృహమార్పు అనివార్యం.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

vruchikam.jpgలావాదేవీలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. చిన్న విషయానికే చికాకు పడతారు. ఎవరినీ నిందించవద్దు. మీ తప్పి దాలను సరిదిద్దుకోండి. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. వివాదాల్లో మీ ప్రమేయం లేకుండా చూసుకోండి. పిల్లల దూకుడు అదుపు చేయండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ,

ఉత్తరాషాఢ 1వ పాదం

dhanussu.jpgతలపెట్టిన కార్యం సఫలమ వుతుంది. వాహనసౌఖ్యం, ప్రశాంతత పొందు తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఒక వ్యవహారంలో మీ జోక్యం తప్పనిసరి. ఉభ యులకూ చక్కని సలహాలిస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాదనలకు దిగవద్దు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం గ్రహిస్తారు. సన్నిహితులతో కాలక్షేపంచేస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4;

శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

makaram.jpgఅన్ని విధాలా అనుకూలం. మాట నిలబెట్టుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ఆత్మీయులకు సాయంచేస్తారు. పనులు వేగవంతమవుతాయి. వ్యవహారంలో సముచిత నిర్ణయం తీసుకుంటారు.నోటీసులు అందుతాయి. పిల్లల చదువులపై దృష్టిపెడ తారు. వాస్తుదోష నివారణ చర్యలు అని వార్యం. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రియతములతో సంభాషిస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

kumbham.jpgస్థిరచరాస్తి ధనం అందుతుంది. లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియ జేయండి. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది.


మీనం

పూర్వాభాద్ర 4వ

పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

meemam.jpgఅనుకూలతలు అంతంత మాత్రమే. ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి నిదా నంగా ఫలిస్తుంది. ప్రణాళికలు వేసుకుంటారు. విమర్శలు పట్టించుకోవద్దు. ఊహించని సంఘ టన ఎదురవుతుంది. నోటీసులు అందుకుంటారు. పోయాయనుకున్న వస్తువులు లభ్య మవుతాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన బలపడుతుంది. సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

నాన్న నేర్పిన ఆ క్రమశిక్షణే నేను ఇప్పటికీ పాటిస్తున్నా..

దేవునికి దణ్ణం పెట్టుకునేటప్పుడు ఎందుకు కళ్లు మూసుకుంటామో తెలుసా..?

Read Latest Telangana News and National News

Updated Date - Apr 12 , 2026 | 09:48 AM