Sankranti 2026 Donations: సంక్రాంతి స్పెషల్.. వీటిని దానం చేస్తే మీ అదృష్టం మారిపోతుంది!
ABN , Publish Date - Jan 15 , 2026 | 11:00 AM
సంక్రాంతి రోజున మన శక్తి మేరకు చేసే చిన్న దానం కూడా జీవితంలో పెద్ద మార్పులు తీసుకువస్తాయని పెద్దలు నమ్ముతారు. లక్ష్మీదేవి కటాక్షం, ధనవృద్ధి, కుటుంబ సౌఖ్యం.. ఇవన్నీ కావాలంటే ఈ సంక్రాంతికి చేయాల్సిన ప్రత్యేక దానాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం…
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు ప్రజల జీవితంలో సంక్రాంతి పండుగకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పంటలు ఇంటికి చేరిన ఆనందంలో రైతులు జరుపుకునే ఈ పండుగ.. కష్టానికి లభించే ఫలితానికి ప్రతీక. సూర్యభగవానుడికి కృతజ్ఞతలు చెప్పే రోజు, పశువులను పూజించే రోజు, కుటుంబం మొత్తం కలసి ఆనందంగా గడిపే రోజు సంక్రాంతి. రంగురంగుల ముగ్గులు, హరిదాసుల గీతాలు, గంగిరెద్దుల సందడి, బొమ్మల కొలువులతో ఊర్లు పండుగ వాతావరణంతో కళకళలాడుతున్నాయి. ఇలాంటి పవిత్రమైన రోజున చేసే దానాలు జీవితంలో శుభఫలితాలను ఇస్తాయని పెద్దలు నమ్ముతారు. ధర్మశాస్త్రాల ప్రకారం సంక్రాంతి రోజున దానం చేయడం వల్ల పుణ్యం లభించడమే కాకుండా, ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి.
గోదానం
సంక్రాంతి రోజున గోవులను దానం చేయడం చాలా శ్రేష్ఠమని చెబుతారు. దీని వల్ల పాపాలు తొలగి, పుణ్యఫలాలు లభిస్తాయని విశ్వాసం.
భూదానం
ఎవరికైనా భూమిని దానం చేయడం అత్యుత్తమ దానంగా భావిస్తారు. ఇది దీర్ఘకాలిక శుభఫలితాలను ఇస్తుందని అంటారు.
బంగారం, వెండి దానం
బంగారం లేదా వెండిని దానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గి, సంపద వృద్ధి అవుతుందని నమ్మకం.

బియ్యం, బెల్లం దానం
కొత్త బియ్యం, బెల్లాన్ని దానం చేస్తే ఇంట్లో ధాన్య సమృద్ధి ఉంటుందని విశ్వాసం. అన్నానికి ఎప్పుడూ కొరత రాదని చెబుతారు.
నువ్వుల దానం
నువ్వులు సూర్యుడు, శనిదేవుడికి ఇష్టమైనవి. నువ్వులు లేదా నువ్వులతో చేసిన ఉండలను దానం చేస్తే జాతక దోషాలు తగ్గి, ఆరోగ్యం మెరుగవుతుందని నమ్మకం.
అన్నదానం
ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం కన్నా గొప్ప దానం లేదు. సంక్రాంతి రోజున అన్నదానం చేస్తే ఇంట్లో అన్నానికి ఎప్పుడూ లోటు ఉండదని పెద్దలు చెబుతారు.

గుమ్మడికాయ దానం
సంక్రాంతి రోజున గుమ్మడికాయను దానం చేయడం చాలా శుభప్రదం. దక్షిణతో కలిపి ఇవ్వడం వల్ల అన్ని కష్టాలు తొలగి, శుభాలు చేకూరుతాయని నమ్మకం.
పసుపు, కుంకుమ వాయినం
పసుపు, కుంకుమ, గాజులు వంటి వాటిని ముత్తైదువులకు వాయినంగా ఇవ్వడం వల్ల ఇంట్లో సౌభాగ్యం, శాంతి పెరుగుతాయని చెబుతారు.

బట్టలు, దుప్పట్లు దానం
పేదలకు ఉన్ని బట్టలు, దుప్పట్లు దానం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది మానవత్వానికి నిదర్శనం కూడా.
ఈ పవిత్రమైన రోజున మన శక్తి మేరకు వీటిని దానం చేస్తే, అది మన జీవితంలో శుభఫలితాలుగా మారి తిరిగి వస్తుందని పెద్దల నమ్మకం. అందుకే ఈ సంక్రాంతి మీ ఇంటికి సంపద, సుఖసంతోషాలు తీసుకురావాలంటే దానాన్ని అలవాటు చేసుకోండి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
మకర సంక్రాంతి 2026.. ఈ 4 తప్పులు చేస్తే అదృష్టం దూరమవుతుంది..
గాలిపటాల మధ్య ఘుమ ఘుమలు.. సంక్రాంతి స్పెషల్ వంటకాలు ఇవే..
For More Latest News