మాఘ పౌర్ణమి వేళ ఇలా చేయండి..
ABN , Publish Date - Jan 31 , 2026 | 01:39 PM
మాఘ శుద్ధ పౌర్ణమి. దీనినే మాఘ పౌర్ణమి లేదా మహామాఘి అని కూడా పిలుస్తారు. ఇది ఫిబ్రవరి 1వ తేదీ.. అంటే ఆదివారం వచ్చింది..
పర్వదినాల మాసం మాఘ మాసం. ఈ మాసంలో మరో పర్వదినం వచ్చింది. అదే మాఘ శుద్ధ పౌర్ణమి. దీనినే మాఘ పౌర్ణమి లేదా మహా మాఘి అని పిలుస్తారు. ఇది ఫిబ్రవరి 1వ తేదీ.. అంటే ఆదివారం వచ్చింది. ఏడాదిలో 12 పౌర్ణములూ విశిష్టమైనవే.. అందులో మరింత విశిష్టమైనవి కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ మాఘ పౌర్ణమి.
ఈ మాసంలో వచ్చే పౌర్ణమి.. శివకేశవులకు ఇద్దరికీ ప్రీతికరమైనదని చెబుతారు. ఈ రోజు ఉదయం సముద్ర లేదా నదీ స్నానం చేయడం వల్ల సకల పాపాలూ హరిస్తాయని స్కాంద పురాణం స్పష్టం చేస్తోంది.
పౌర్ణమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే..
ప్రారంభం: ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 5.53 గంటలకు ప్రారంభమవుతుంది.
ముగింపు: ఫిబ్రవరి 2వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3.39 గంటలకు ముగియనుంది.
సూర్యోదయాన్ని అనుసరించి.. ఉదయం తిథి ప్రధానం కావడంతో మాఘ పౌర్ణమి ఆదివారం జరుపుకోవాలి.
ఈ రోజు విశిష్టత..
మాఘ పౌర్ణమి రోజు దేవతలు దివి నుంచి భూవిపైకి వచ్చి పవిత్ర నదుల్లో స్నానమాచరిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ రోజు నది, సముద్ర స్నానం చేయడంతో పాటూ దాన ధర్మాలు చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి.
నువ్వుల దానం: ఈ రోజు నువ్వులు దానం చేయడం వల్ల విశేష ఫలితం దక్కుతుంది.
గురు దోషం: జాతకరీత్యా కొంతమందికి గురుదోషం ఉంటుంది. వారు దేవాలయంలోని నవ గ్రహాల్లో గురు గ్రహం వద్ద పసుపు వస్త్రం ఉంచి ప్రత్యేక పూజలు చేయాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అలా సాధ్యం కాకుంటే.. ఇంట్లోని ఈశాన్యం మూల ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి.
గౌరి దేవిని పూజించాలి: మాఘ పౌర్ణమి పరమశివుడి సతీమణి పార్వతీ దేవికి అత్యంత ఇష్టమైన రోజు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారితో పాటూ దాంపత్య సమస్యలతో ఇబ్బంది పడే వారు.. అమ్మవారిని పూజిస్తే మంచిది. ఇంకా వివరంగా చెప్పాలంటే.. పసుపుతో గౌరి దేవిని చేసి.. కుంకుమ, గంధంతో పూజించాలి. అలాగే అమ్మవారి అష్టోత్తరాన్ని చదవాలి.
ఈ సందర్భంగా అమ్మవారికి బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు గోరింటాకు దానం ఇవ్వడం వల్ల పెళ్లి కాని యువతులకు వివాహం త్వరగా అవుతుందంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఇకపై తిరుగు లేదు!
మాఘమాసం ఎప్పుడు.. ఈ మాసంలో ఏం చేయాలి..
For More Devotional News And Telugu News