ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఇకపై తిరుగు లేదు!
ABN , Publish Date - Jan 30 , 2026 | 10:28 AM
రవి.. తన సంచారాన్ని మార్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రాశులకు అలా ఇలా కాదు.. ఒక రేంజ్‌లో కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఆ వివరాలేంటంటే...
ఫిబ్రవరి మాసంలో రవి.. తన సంచారంతో కొన్ని రాశుల వారి జాతకాలను పూర్తిగా మార్చేయబోతున్నాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ ఒక్క మాసంలోనే సూర్యుడు.. తన స్థానాన్ని మార్చుకుంటున్నాడని వివరిస్తున్నారు. ఫిబ్రవరి 6 ధనిష్ట నక్షత్ర ప్రవేశం.. ఫిబ్రవరి 13న కుంభరాశిలో అడుగు పెట్టడం.. అనంతరం ఫిబ్రవరి 19న శతభిష నక్షత్ర సంచారం.. ఇలా సూర్యుడు వేగంగా సంచరిస్తుండటంతో నాలుగు రాశుల వారికి రాజయోగం కలగబోతుంది. పేదరికం పోయి కోటీశ్వరులు అయ్యేంతటి అదృష్టం ఈ రాశులను వరించనుంది. ఆ రాశులు ఏవంటే...
మేషరాశి..
ఈ రాశి వారికి సూర్య సంచారం సువర్ణావకాశం. వీరిలో ఆత్మ విశ్వాసం ఉరకలెత్తనుంది. ఉద్యోగస్థులకు ప్రమోషన్లతో పాటు ఊహించని విధంగా జీతాల పెంపు ఉంటుంది. పాత పెట్టుబడులు.. కాసుల వర్షం కురిపిస్తాయి. విదేశీ ప్రయాణానికి మార్గం సుగమం అవుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి కీలక పదవులు వరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
సింహరాశి..
ఈ రాశి వారికి సూర్యుడు అధిపతి. దీంతో సూర్యుడి సంచారం వల్ల రెట్టింపు ఉత్సాహం ఉంటుంది. వాహనాలు లేదా స్థలాలు కొనుగోలు చేయాలనుకునే మీ కల ఈ సమయంలో నెరవేరనుంది. కాంట్రాక్టులకు సంబంధించి నూతన ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. గతంలో నిలిచిపోయిన పనులు ఈ సమయంలో వేగవంతంగా పూర్తవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.
ధనస్సు రాశి..
ఈ రాశి వారికి సూర్యుడు మూడు రెట్ల ప్రయోజనాలు తీసుకొస్తున్నాయి. నూతన ఆదాయ మార్గాలు ఉంటాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో బాధ్యతలతో పాటు అధికారం లభిస్తుంది. స్టాక్ మార్కెట్ లేదా ఇతర రంగాల్లో పెట్టిన పెట్టుబడులు లాభాల బాటపడతాయి.
కుంభ రాశి..
సూర్యుడు ఈ రాశిలోకి ప్రవేశించడంతో.. మీ దశ తిరగనుంది. మీ ఆలోచనా విధానంలో స్పష్టత వస్తుంది. మీరు తీసుకునే సాహసోపేత నిర్ణయాలు భవిష్యత్తుకు పునాది వేస్తాయి. వ్యాపార భాగస్వాములతో ఉన్న విభేదాలు తొలగి.. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ప్రస్తుతం మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం భవిష్యత్తులో భారీ లాభాలను తెచ్చిపెడుతుంది.
ఈ ఫిబ్రవరి మాసం.. ఈ నాలుగు రాశుల వారికి మలుపు వంటిదని పండితులు చెబుతున్నారు. సూర్యుడి అనుగ్రహంతో ఆర్థిక కష్టాలు తొలగి, సుఖశాంతులు చేకూరనున్నాయి. ఈ రాశుల వారు శ్రమను నమ్ముకుని ముందుకు సాగితే.. భవిష్యత్తు బంగారంలా ఉంటుందని జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు.
ముఖ్య గమనిక: పైన అందించిన సమాచారం జ్యోతిష్య పండితుల ఆధారంగా తీసుకుని రాసినవి మాత్రమే. వీటిని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వామితో పెట్టుకుంటే భూస్థాపితమేనని చరిత్ర చెబుతోంది: మంత్రి వాసంశెట్టి
మేడారంనకు పోటెత్తిన భక్తులు.. నేడు గవర్నర్ రాక..
For More Devotional News And Telugu News