Share News

హనుమజ్జయంతి రోజు ఇలా చేస్తే..

ABN , Publish Date - May 12 , 2026 | 07:56 AM

శ్రీరామ భక్తుడు హనుమంతుని జయంతి నేడు. ఈ రోజు హనుమంతుని పూజించినా, ఆయన స్తోత్రాలు పఠించినా, జీవిత చరిత్ర చదివినా, విన్నా కూడా శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి..

హనుమజ్జయంతి రోజు ఇలా చేస్తే..
Hanuman Jayanti

శ్రీరామ భక్తుడు హనుమంతుని జయంతి నేడు. ఈ రోజు హనుమంతుని పూజించినా, ఆయన స్తోత్రాలు పఠించినా, జీవిత చరిత్ర చదివినా, విన్నా కూడా శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.. హనుమంతునికి ప్రీతికరమైన రోజు మంగళవారం. ఆ రోజే హనుమజ్జయంతి రావడం విశేషం. ఈ రోజు స్వామి వారిని భక్తితో పూజిస్తే.. ధైర్యం, ఆరోగ్యం, విజయం, ఐశ్వర్యం కలుగుతాయని పండితులు చెబుతున్నారు..


హనుమజ్జయంతి..

ఈ రోజు ఉదయాన్నే స్నానం చేసి.. శుభ్రమైన దుస్తులు ధరించాలి. స్వామి వారి చిత్రపటం ముందు నువ్వుల నూనె, లేదా ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. హనుమంతుని అష్టోత్తరం, హనుమాన్ చాలీసా, సుందరకాండ, ఆంజనేయ దండకం పారాయణం చేయడం శుభప్రదం. ఇలా చేయడం వల్ల అఖండ ఐశ్వరం లభిస్తుందని భక్తుల విశ్వాసం.


స్వామి వారికి నైవేద్యం..

పానకం, వడపప్పు, గారెలు, బెల్లం అప్పాలు సమర్పించాలి.

దేవాలయంలో స్వామి వారికి వడమాల, తమలపాకు మాల సమర్పించినా.. విశేష ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

ఈ రోజు పాటించాల్సిన నియమాలు..

ఉపవాసం ఉండాలి. పాలు, పండ్లు తీసుకోవాలి.

రాత్రి వేళ సాత్వికాహారం తీసుకోవాలి.

బ్రహ్మచర్యం ఆచరించాలి.

చాపపై నిద్ర పోవాలి.

మద్యం, మాంసం తీసుకోకూడదు.

పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయాలి.


కష్టాలు, భయాలు తొలగిపోతాయి..

హనుమంతుడిని పూజించడం వల్ల జీవితంలో కష్టాలు, భయాలు తొలగిపోతాయి. మానసిక ధైర్యం, ఆరోగ్యంతో పాటూ అపారమైన శక్తి లభిస్తుంది. ఆంజనేయుడిని కొలవడం వల్ల ధైర్యం కలుగడమే కాకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే గ్రహ దోషాలను తొలగిపోతాయి. విద్య, ఉద్యోగాల్లో విజయం సాధిస్తారని హిందూ ధర్మ శాస్త్రం చెబుతోంది.


ఏళ్లనాటి శని నుంచి ఉపశమనం..

ఏళ్ల నాటి శని, అర్ధాష్టమ శనితో ఇబ్బందులు పడుతున్న వారు.. ఈ హనుమాన్ జయంతి రోజు.. స్వామి వారిని దర్శించుకుంటే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

స్వామి వారికి తమలపాకుల దండ వేస్తే కోరికలు తీరతాయి.

స్వామి వారి సింధూరం ధరిస్తే.. ఆపదల నుంచి గట్టెక్కవచ్చు.

ఆంజనేయుని దండకం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల అనుకున్న పనులు నెరవేరతాయి.


ముఖ్య గమనిక.. పైన తెలిపిన వివరాలు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి. వీటికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఎటువంటి సంబంధం లేదని గమనించాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

కర్తరి ప్రారంభం.. ఈ సమయంలో ఏం చేయాలి.. ఏం చేయకూడదు?

ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా ఈ నెల 18న విడుదల

For More Devotional News And Telugu News

Updated Date - May 12 , 2026 | 08:53 AM