ఆగస్టు నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా ఈ నెల 18న విడుదల
ABN , Publish Date - May 09 , 2026 | 01:59 PM
తిరుమల తిరుపతి దేవస్థానం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈనెల 18న విడుదల చేయనుంది.
తిరుమల, మే 9: తిరుమల తిరుపతి దేవస్థానం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈనెల 18న విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన టికెట్లు 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం అవకాశం ఉంటుంది. లాటరీలో ఎంపికైన భక్తులు 20వ తేదీనుంచి 22వ తేదీ మధ్యాహ్నం లోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరు అవుతాయి.
21వ తేదీ ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపకాలంకార సేవల టికెట్లు విడుదల అవ్వనున్నాయి. 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం కోటా, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన కోటా అందుబాటులో ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా అందుబాటులోకి రానుంది. 25వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం 300 రూపాయల టికెట్ల కోటా.. మధ్యాహ్నం 3 గంటలకు అద్దె గదుల బుకింగ్ కోటా అందుబాటులోకి రానున్నాయి.
ఇవి కూడా చదవండి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. నెలకు రూ.30 వేల కోట్ల నష్టం..
సర్కిల్‌కు టిప్పు సుల్తాన్ పేరు.. కడపలో ఉద్రిక్తం