Share News

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. నెలకు రూ.30 వేల కోట్ల నష్టం..

ABN , Publish Date - May 09 , 2026 | 01:49 PM

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ విషయాన్ని తాజాగా విడుదలైన నివేదికలు వెల్లడించాయి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. నెలకు రూ.30 వేల కోట్ల నష్టం..
India fuel prices

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ ధరలను స్థిరంగా ఉంచేందుకు నెలకు సుమారు రూ.30,000 కోట్ల మేర నష్టాన్ని భరిస్తున్నాయి. ఈ విషయాన్ని తాజాగా విడుదలైన నివేదికలు వెల్లడించాయి (Indian oil companies losses).


హోర్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 100 డాలర్లు కూడా దాటేసింది. అయినప్పటికీ దేశీయంగా మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెరగకుండా ప్రభుత్వం నియంత్రిస్తోంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా వినియోగదారులపై వెంటనే భారం పడకుండా ప్రభుత్వ ఆయిల్ సంస్థలే అదనపు ఖర్చును భరిస్తున్నాయి. దీంతో ఆయా సంస్థలకు రోజుకు రూ.700 కోట్ల మేర, నెలకు రూ.30 వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతోందట (fuel price hike India).


ముడి చమురు సంక్షభం కారణంగా ప్రపంచంలోని పలు దేశాల్లో చమురు ధరలు భారీగా పెరిగాయి (Iran conflict impact). స్పెయిన్‌లో అత్యధికంగా 34 శాతం మేర పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఇక, జపాన్, ఇటలీ, ఇజ్రాయెల్‌లో 30 శాతం, జర్మనీలో 27 శాతం, బ్రిటన్‌లో 22 శాతం మేర చమురు ధరలు పెరిగాయి. మన దేశంలో మాత్రం చమురు ధరలు పెరగకుండా ప్రభుత్వం నియంత్రిస్తోంది. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పది శాతం మేర తగ్గించింది.


ఇవి కూడా చదవండి..

రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ.. ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్..


స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - May 09 , 2026 | 01:52 PM