ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే..?
ABN , Publish Date - Mar 30 , 2026 | 03:45 PM
జ్యోతిష్య రీత్యా జాతకంలో అష్టమ శని నడుస్తుంటే.. దీని ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని పండితులు చెబుతున్నారు.
జ్యోతిష్య రీత్యా జాతకంలో అష్టమ శని నడుస్తుంటే.. దీని ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని పండితులు చెబుతున్నారు. అనారోగ్యం, వాహన ప్రమాదాలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని అంటున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం.. గోచార, ప్రస్తుతం ఆకాశంలో గ్రహాల సంచారరీత్యా శనిగ్రహం మీ జన్మ రాశి నుంచి 8వ స్థానంలో సంచరించడాన్ని అష్టమ శని అంటారని పేర్కొంటున్నారు.
దీని ప్రభావం ఒక రాశిపై దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉంటుందని.. ప్రస్తుతం మీన రాశిలో శని సంచరిస్తున్నాడని సోదాహరణగా వివరిస్తున్నారు. ప్రస్తుతం సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఈ రాశి వారికి 29-03-2025న ఈ అష్టమ శని ప్రభావం ప్రారంభమైందని.. ఇది 23-02-2028 వరకు ఉంటుందని జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఎలా ఉంటుంది.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారు విశదీకరిస్తున్నారు.
ఈ సమయంలో ఎలాంటి ప్రభావం ఉంటుందంటే..?
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఉద్యోగంలో ఒత్తిళ్లు, వృత్తిపరంగా మార్పులు ఉంటాయి. బంధుమిత్రులతో సైతం మనస్పర్థలు వచ్చే అవకాశాలున్నాయి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఈ అష్టమ శని ప్రభావ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దోష తీవ్రత తగ్గుతుంది.
ఈ సమయంలో ఆస్తులు కొనుగోలు చేయడం, భారీ పెట్టుబడులు పెట్టడం వంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు.. అనుభవజ్ఞులు సలహాలు తీసుకోవడం మంచిది.
మాట తీరు మార్చుకోవాలి.. అంటే కోపాన్ని తగ్గించుకుని మాట్లాడాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాల్సి ఉంటుంది.
ప్రయాణాల్లో సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు పాటించాలి. రాత్రి వేళ ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు నడిపే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. వ్యాయామం తప్పక చేయాలి.
ఇలా చేయడం వల్ల అష్టమ శని ప్రభావం తగ్గుతుంది..
ప్రతీ రోజు హనుమాన్ చాలీసా చదవాలి.
ప్రతీ శనివారం దేవాలయంలో శనికి తైలాభిషేకం చేయాలి.
నిరుపేదలు, దివ్యాంగులకు అన్నదానంతోపాటు వస్త్రదానం చేస్తే మంచిది.
శనికి సంబంధించిన స్తోత్రాలు, హనుమంతుని మంత్రాలు పఠించడం వల్ల ఈ అష్టమ శని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.
ముఖ్య గమనిక: పైన అందించిన సమాచారం జ్యోతిష్య పండితులు చెప్పిన వాటి ఆధారంగా తీసుకుని రాసినవి మాత్రమే. వీటిని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ధ్రువీకరించదు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాలను ఇలా తాగితే హైబీపీకి చెక్.. సింపుల్ చిట్కా..
క్రీడా మైదానాలు 'కార్యక్రమాల' వేదికలు కాకూడదు..
For More Devotional News And Telugu News