ఆ రాశి వారు ఈ వారం అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Feb 22 , 2026 | 08:27 AM
ఈ వారం రాశిఫలాలు.. 22 - 28 ఫిబ్రవరి 2026.. ఆ రాశి వారు ఈ వారం అప్రమత్తంగా ఉండాలి. అలాగే తలపెట్టిన కార్యం సిద్థిస్తుంది. పరిస్థితులు చక్కబడతాయి.
అనుగ్రహం
22 - 28 ఫిబ్రవరి 2026
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయం తగదు. అనుభ వజ్ఞులను సంప్రదించండి. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పనులు త్వరితగతిన సాగు తాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. అందరి తోనూ మితంగా సంభాషించండి. గిట్టని వ్యక్తులు మీ వ్యాఖ్యలు వక్రీకరిస్తారు. కుటుంబ సౌఖ్యం పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆహ్వానం అందుకుంటారు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
తలపెట్టిన కార్యం సిద్థిస్తుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. యత్నాలకు సన్నిహితులు సహకరిస్తారు. నిలిపివేసిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. బంధుమిత్రులతో సంభా షిస్తుంటారు. నోటీసులు అందుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. పెద్దల జోక్యంతో సమస్య పరిష్కారమవుతుంది.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
పరిస్థితులు చక్కబడతాయి. కొత్త యత్నాలు చేపడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలకు తావివ్వవద్దు. పెద్దమొత్తం సాయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియ జేయండి. ఎవరినీ తక్కువగా చూడొద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. లైసెన్సులు, పర్మిట్‌ల రెన్యువల్‌లో జాప్యం తగదు. ముఖ్య మైన బాధ్యతలు స్వయంగా చూసుకోండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీల్లో మెలకువ వహించండి. మీ నిర్ణయం వాయిదా వేయటం శ్రేయస్కరం. అనుభవజ్ఞులను సంప్రదించండి. ఖర్చులు విపరీతం. పనులు మందకొడిగా సాగుతాయి. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. పత్రాల రెన్యువల్‌లో జాప్యం తగదు. ఆశించిన సంబంధం నిరుత్సాహ పరుస్తుంది. ఆశావహదృక్పథంతో మెలగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆలస్యంగానైనా చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహనిర్మాణం పూర్తికావస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ప్రము ఖులకు చేరువవుతారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఉత్సాహంగా గడుపుతారు. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. మితంగా సంభాషించండి. ఆరోగ్యం మందగిస్తుంది.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
లావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. స్థిరాస్తి ధనం అందుతుంది. కొంతమొత్తం పొదుపు చేస్తారు. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రలోభాలకు లొంగవద్దు. మీ సమస్యలను ఆప్తులకు తెలియ జేయండి. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఉల్లాసంగా గడుపుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకువస్తాయి.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
సర్వత్రా అనుకూలం. ప్రతీ విషయంలోనూ ధైర్యంగా ఉంటారు. అవకాశాలు కలిసివస్తాయి. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలు చేప డతారు. సాయం ఆశించవద్దు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. పనుల్లో శ్రమ అధికం. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఖర్చులు అధికం. సంతృప్తికరం. పెట్టుబడులు కలిసిరావు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆహ్వానం, పత్రాలు అందుకుంటారు.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
కలిసివచ్చే సమయం. మీ వాక్కు ఫలిస్తుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆశించిన పదవి దక్కకపోవచ్చు. ఇదీఒకందుకు మంచికే. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. పత్రాలు అందుకుంటారు. మీ సాయంతో ఒకరికి లబ్థి చేకూరుతుంది. స్థిరాస్తి వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికావద్దు. ధార్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
వ్యవహారానుకూలత ఉంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. కొత్త కార్య క్రమాలు చేపడతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఒక సమస్య మీకు సానుకూలంగా పరిష్కారమవు తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. అందరితోనూ మితంగా సంభాషించండి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. అవసరాలకు ధనం అందుతుంది. చాక చక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. అప్రమత్తంగా ఉండాలి. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నోటీసులు అందుకుంటారు. నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. దూరప్రయాణం తలపెడతారు.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
వ్యవహారజయం, కార్యసిద్ధి ఉన్నాయి. దుబారా ఖర్చులు విపరీతం. అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. మొండిగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. దళారులను అతిగా నమ్మవద్దు. ప్రతీ విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు ముందుకు సాగవు. పుణ్యకార్యంలో పాల్గొంటారు.
ఈ వార్తలు కూడా చదవండి:
జీపీ భవనం కోసం అప్పు..సొంత భూమి తనఖా
Read Latest Telangana News and National News