వారఫలాలు...ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే.?
ABN , Publish Date - Aug 02 , 2026 | 06:48 AM
ఈ వారం రాశిఫలాలు.. 2 - 8 ఆగస్టు 2026, పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
స్థిరాస్తి ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. సభ్యత్వం స్వీకరణకు అనుకూలం. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్థాంతరంగా ముగి స్తారు. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. శుభకార్యానికి హాజరవుతారు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు
అన్నివిధాలా అనుకూలమే. పరిస్థితులు చక్కబడతాయి. కార్యసిద్థి, ధన లాభం ఉన్నాయి. వ్యవహారపరిజ్ఞానంతో నెట్టు కొస్తారు. లావాదేవీలు ముగుస్తాయి. ఖర్చులు విపరీతం. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగ కుండా మెలగండి. సన్నిహితులతో తరచూ సంభాషిస్తుంటారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. ప్రయాణం తలపెడతారు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
నూతన యత్నాలు చేపడతారు. ఏకాగ్రతతో శ్రమించండి. సాయం ఆశించ వద్దు. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలేసు కుంటారు. అంచనాలు ఫలిస్తాయి. వెండి, బంగారం కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త. నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆచితూచి అడుగేయండి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అనవసర జోక్యం తగదు. ఇంటి విషయాలపై దృష్టిపెడతారు.
కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పరిస్థితులు చక్కబడతాయి. లక్ష్యం సాధిస్తారు. మీ సామర్థ్యంపై గురికుదు రుతుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనులు, బాధ్యతలు పుర మాయించవద్దు. కీలక పత్రాలు అందు కుంటారు. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. పిల్లల కదలికలపై దృష్టిపెట్టండి.
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గ్రహస్థితి ప్రతికూలంగాఉంది. అప్రమత్తంగా ఉండాలి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞులను సంప్రదిం చండి. దుబారా ఖర్చులు విపరీతం. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. నోటీసులు అందుకుంటారు. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. గృహ మరమ్మతులు చేపడతారు. పరిచయాలు బల పడతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు
కార్యసాఫల్యతకు మరింత శ్రమించాలి. అవకాశాలు చేజారిపోతాయి. ఆదాయం నిరాశాజనకం. పురోగతి లేక నిేస్తజానికి లోనవుతారు. ఖర్చులు విపరీతం. పనులు ఒక పట్టాన సాగవు. చీటికిమాటికి చికాకుపడతారు. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉం టుంది. పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెడతారు.
తుల
చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
మీదైన రంగంలో నిలదొక్కు కుంటారు. లక్ష్యం నెరవేరుతుంది. అవకాశాలు కలిసివస్తాయి. ప్రముఖులకు సన్నిహితుల వుతారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఖర్చులు విపరీతం. అందరితోనూ మితంగా సంభాషిం చండి. కొంతమంది మీ వ్యాఖ్యలను తప్పుపడ తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసు కోండి. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా అడుగులేస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
స్థిరాస్తి ధనం అందుతుంది. రుణవిముక్తులవుతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. నోటీసులు అందుకుంటారు. సమాచారం ఆలోచింప చేస్తుంది. నిపుణులను సంప్రదిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
తలపెట్టిన కార్యం నెరవేరు తుంది. సంప్రదింపులు కొలిక్కివస్తాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు ప్రయోజ నకరం. సంస్థల స్థాపనలకు అనుకూలం. అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. వేదికలు అన్వేషి స్తారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు ఆస్కారం ఉంది.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
ప్రతికూలతలు అధికం. మీ కష్టం వేరొకరికి కలిసివస్తుంది. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఖర్చులు తగ్గించుకుంటారు. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ముఖ్యమైన పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆచితూచి అడుగేయాల్సిన సమయం. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తొందరపాటు నిర్ణయం తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. మీ నిర్ణయం వాయిదా వేయటం శ్రేయస్కరం. పనులు మొదలెట్టేసరికి ఆటంకాలు ఎదురవు తాయి. మొండిధైర్యంతో ముందుకు సాగు తారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుం టాయి. పొదుపునకు ఆస్కారం లేదు. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు.
మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడ తాయి. కానుకలిచ్చిపుచ్చుకుంటారు. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. పత్రాల్లో మార్పు చేర్పులు సాధ్యమవుతాయి. చిన్ననాటి పరిచ యస్తులు తారసపడతారు. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు.