Share News

ఏం కష్టమొచ్చిందో..!

ABN , Publish Date - Apr 01 , 2026 | 11:52 AM

ఏం కష్టమొచ్చిందో ఆ మహిళకు.. ఇద్దరు కుమార్తెలను హతమార్చి తనూ బలవన్మరణానికి పాల్పడింది.

ఏం కష్టమొచ్చిందో..!

  • ఇద్దరు కుమార్తెలను హతమార్చి.. మహిళ ఆత్మహత్య

  • తేని జిల్లాలో దారుణం

చెన్నై: ఏం కష్టమొచ్చిందో ఆ మహిళకు.. ఇద్దరు కుమార్తెలను హతమార్చి తనూ బలవన్మరణానికి పాల్పడింది. తేని జిల్లాలో జరిగిన ఈ విషాధ సంఘటనకు సంబంధించి పోలీసుల కథనం మేరకు ... డోంబుచేరి గ్రామానికి చెందిన ముత్తుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో రెండవ కుమార్తె పాపాత్తి (30)కి శివకాశి సమీపంలోని నారాయణపురానికి చెందిన ప్రశాంత్‌తో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు అరుణ (8), సంగీత (5) అనే ఇద్దరు కుమార్తెలున్నారు.


పాపాత్తి కొద్దికాలంగా మానసిక సమస్యలతో బాధపడుతూ, కుమార్తెలతో కలసి పుట్టింట్లో ఉంటూ చికిత్స పొందుతోంది. ఈ నెల 28వ తేది షాపింగ్‌ వెళ్తున్నామని ఇంట్లో చెప్పిన పాపాత్తి.. ఇద్దరు కుమార్తెలతో వెళ్లింది. రాత్రి వరకు వారు రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయింది. మనవరాళ్లు, కుమార్తె అదృశ్యంపై తల్లిదండ్రులు పళనిచెట్టిపట్టి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


city1.jpgఈ క్రమంలో, సోమవారం రాత్రి అదే గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక చికిత్సా కేంద్రం ఎదురుగా ఉన్న బావిలో మూడు మృతదేహాలను గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని బావి నుంచి మృతదేహాలు వెలికితీసి పరిశీలించగా, పాపాత్తి, ఆమె కుమార్తెలు అరుణ, సంగీత మృతదేహాలుగా గుర్తించారు. విచారణలో, ఇద్దరు కుమార్తెలను బావిలో వేసిన పాపాత్తి, తాను కూడా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిందని తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

చిత్తూరులో అదృశ్యమైన మహిళ దారుణ హత్య

కోనసీమలో కుమ్ముడు నిజమే!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 01 , 2026 | 11:52 AM