ఇంట్లోంచి వెళ్లిపొమ్మన్నాడని హత్య
ABN , Publish Date - Feb 26 , 2026 | 10:05 AM
తన డబ్బులు తీసుకోవడమే కాకుండా.. ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మన్నందుకు కోపంతోనే తన బావ అయిన మొగిళిని హత్య చేసినట్లు నిందితురాలు ఇందిర అంగీకరించింది.
సిద్ధాపూర్ వృద్ధుడి హత్య కేసులో నిందితురాలి అరెస్టు
హసన్‌పర్తి(వరంగల్): తన డబ్బులు తీసుకోవడమే కాకుండా.. ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మన్నందుకు కోపంతోనే తన బావ అయిన మొగిళిని హత్య చేసినట్లు నిందితురాలు ఇందిర అంగీకరించింది. ఈ మేరకు మండలంలోని సిద్ధాపూర్ గ్రామంలో మంగళవారం బాల్నె మొగిళి (70) హత్య కేసులో వంగ ఇందిరను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ వట్టె చేరాలు తెలిపారు. ఆయన కథనం ప్రకారం...
ఇందిరకు 30 ఏళ్ల కిందట వివాహమై విడాకులయ్యాయని, ఆ సమయంలో తన భర్త తరుపువారు సుమారు రూ.60వేలు ఇవ్వగా ఆ డబ్బును తన బావ బాల్నె మొగిళి తన వద్దే ఉంచుకున్నాడు.
అప్పటి నుంచి వాటిని ఇవ్వకుండా వాడుకున్నాడు. ఈ క్రమంలోనే ఇందిర సోదరి సరోజన మూడు నెలల కిందట మరణించగా సిద్ధాపూర్‌లోని సొంత ఇంటికి తీసుకువచ్చి దహన సంస్కారాలు పూర్తి చేశారు. అప్పటి నుంచి ఒకే ఇంట్లో ఇందిర, మొగిళి నివాసం ఉంటుండగా.. డబ్బుల విషయం తీయగా తనను తిడుతూ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని గొడవ పడినట్లు నిందితురాలు చెప్పిందన్నారు. డబ్బులు ఇవ్వకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని వేధింపులకు గురిచేస్తున్న మొగిళిని ఎలాగైనా చంపాలనుకొని ఇందిర పధకం వేసిందన్నారు.
మంగళవారం ఉదయం కాలకృత్యాలకు వెళ్తున్న మొగిళిని ఇంటి వెనకాల వెనక నుంచి నెట్టి వేసి కిందపడేసి రాయితో, కత్తి, కర్రతో విచక్షణారహితంగా ముఖంపై దాడి చేసి హత్య చేసి పరారైంది.
ఈ మేరకు మృతుడి కుమారుడు రాజుకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, బుధవారం వంగపహాడ్ గ్రామ శివారు ఔటర్ రింగ్‌రోడ్డుపై నిందితురాలిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఆమె వద్ద హత్యకు ఉపయోగించిన కత్తి, కర్ర, రాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News