Share News

గాలిపటం ఎగురవేస్తూ..

ABN , Publish Date - Feb 10 , 2026 | 08:22 AM

గాలిపటం ఎగురవేస్తూ రేకుల షెడ్డుపై నుంచి కింద పడి ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మైలార్‌దేవుపల్లి పోలీస్‏స్టేషన్‌ పరిధిలో జరిగింది.

గాలిపటం ఎగురవేస్తూ..

- రేకులషెడ్‌పై నుంచి పడి బాలుడి మృతి

హైదరాబాద్: గాలిపటం ఎగురవేస్తూ రేకుల షెడ్డుపై నుంచి కింద పడి ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మైలార్‌దేవుపల్లి పోలీస్‏స్టేషన్‌(Mylardevupally Police Station) పరిధిలో సోమవారం జరిగింది. ఎస్‌ఐ విశ్వనాథ్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంచిర్యాల్‌కు చెందిన మహేందర్‌, సుజాత దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి సాయిబాబానగర్‌లో నివాసం ఉంటున్నారు.


city4.2.jpgమహేందర్‌ కుమారుడు హేమంత్‌ (10) 6వ తరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం 7గంటల ప్రాంతంలో ఇంటిపై గాలిపటం ఎగురవేస్తూ పక్కన ఉన్న మరో రేకుల షెడ్డు పైకి వెళ్లాడు. ఓ రేకుపై కాలుపెడుతూనే కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో హేమంత్‌ అక్కడికి అక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం, వెండి స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆధార్‌ సేవల విస్తరణకు చర్యలు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 10 , 2026 | 08:59 AM