రూ.2 వేల వరకు యూపీఐ చెల్లింపులపై చార్జీలు నిషేధం: కేంద్ర ప్రభుత్వం
ABN , Publish Date - Sep 15 , 2026 | 08:39 AM
యూపీఐ చెల్లింపులపై ఎలాంటి చార్జీలు విధించరాదని బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రూ.2 వేల వరకు యూపీఐ చెల్లింపులు, రూపే డెబిట్ కార్డుతో చేసే చెల్లింపులపై చార్జీలు వసూలు చేయడం నిషేధమని తెలిపింది.
ఇంటర్‌నెట్ డెస్క్: యూపీఐ చెల్లింపులపై ఎలాంటి చార్జీలు విధించరాదని బ్యాంకులు, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రూ.2 వేల వరకు యూపీఐ చెల్లింపులు, రూపే డెబిట్ కార్డుతో చేసే చెల్లింపులపై చార్జీలు వసూలు చేయడం నిషేధమని తెలిపింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 సెక్షన్ 10ఏ కింద కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘స్పెసిఫైడ్ మోడ్ల ద్వారా చెల్లింపులు చేసే లేదా రిసీవ్ చేసుకునే వ్యక్తి నుంచి బ్యాంకులుగానీ, పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్‌గానీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి చార్జీలు వసూలు చేయరాదు’ అని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. కొత్త రూల్ ప్రకారం రూ.2 వేల వరకు యూపీఐ ట్రాన్సాక్షన్లపైనా, అలాగే రూపే డెబిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపైనా ఎలాంటి చార్జీలు ఉండవు. అయితే, మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ను అమలు చేయకపోయినా.. రూ.2 వేలు దాటిచేసే యూపీఐ ట్రాన్సాక్షన్లపై చార్జీలు విధించే అవకాశం ఉంది. ఎండీఆర్ పద్ధతిలో చేసే ట్రాన్సాక్షన్లపై కస్టమర్లు కాకుండా మర్చంట్లపైనే చార్జీలు విధిస్తామని, పర్సన్ టు పర్సన్ పేమెంట్లపై ఎలాంటి చార్జీలు ఉండవని కేంద్రం గత నెలలో పేర్కొంది. డిజిటల్ విధానంలో చెల్లింపులు భారీగా పెరుగుతున్నందున దేశ డిజిటల్ పేమెంట్ సిస్టమ్‌ను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి చార్జీలు ప్రవేశపెట్టే ఆలోచన ఉందని కేంద్రం తెలిపింది.
ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ ఫాస్ట్ పేమెంట్‌గా యూపీఐ
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) నిర్వహిస్తున్న యూపీఐ.. లావాదేవీలపరంగా ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్‌గా అవతరించింది. 2025లో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. గత నెలలో యూపీఐ ద్వారా 24.51 బిలియన్ లావాదేవీలు జరిగాయి. వీటి మొత్తం విలువ రూ.29.82 ట్రిలియన్లు. మొత్తం లావాదేవీల పరిమాణంలో దాదాపు మూడు వంతులను గూగుల్ పే, వాల్‌మార్ట్‌కు చెందిన ఫోన్‌పే నిర్వహించాయి. పెద్ద మొత్తంలో జరిగే వ్యాపార లావాదేవీలపై చార్జీలు విధించే అవకాశం వస్తే.. అది బ్యాంకులు, చెల్లింపు సేవల సంస్థలకు కొత్త ఆదాయ మార్గంగా మారవచ్చు. ఇలాంటి చార్జీల ద్వారా చెల్లింపు పరిశ్రమకు ఏటా రూ.5,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల వరకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని జెఫరీస్ అనే సంస్థ గత నెలలో అంచనా వేసింది.
Also Read:
ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా ఆయుధ, ఆర్థిక, సైనిక సామర్థ్యానికి భారీ దెబ్బ..
హోర్ముజ్ భద్రత కోసం అమెరికాకు డబ్బులు చెల్లించాలి.. దేశాలకు ట్రంప్ డిమాండ్..
వేల కోట్ల ఆస్తి.. కానీ భిక్షాటన చేసిన ఎమ్మెల్యే..