యువతరాన్ని ఆకర్షించేందుకు టాటా.కార్స్
ABN , Publish Date - Aug 28 , 2026 | 03:24 AM
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ లిమిటెడ్ (టీఎంపీవీ) తన కొత్త బ్రాండ్ గుర్తింపు ‘టాటా.కార్స్’ను గురువారం ఆవిష్కరించింది.
కొత్త బ్రాండ్ గుర్తింపును ఆవిష్కరించిన టీఎంపీవీ
ముంబై: టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ లిమిటెడ్ (టీఎంపీవీ) తన కొత్త బ్రాండ్ గుర్తింపు ‘టాటా.కార్స్’ను గురువారం ఆవిష్కరించింది. విస్తరిస్తున్న కంపెనీ ప్యాసింజర్ వాహనాల పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేయటంతో పాటు యువతరం కార్ల కొనుగోలుదారులను ఆకర్షించడమే దీని లక్ష్యమని టీఎంపీవీ ఎండీ, సీఈఓ శైలేష్ చంద్ర తెలిపారు. హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్లు, ప్రీమియం ఎస్‌యూవీలు, ఎలక్ర్టిక్ వెహికిల్స్, ఫ్యూచర్ మొబిలిటీ సొల్యూషన్లను టాటా.కార్స్ బ్రాండ్ కిందకు తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. డిజిటల్ చానళ్లు, రిటైల్ కేంద్రాలు, సర్వీస్ టచ్ పాయింట్లు, బ్రాండ్ కమ్యూనికేషన్స్ వాటిపై కొత్త బ్రాండ్ కనిపించనుంది.
ఈశా క్యాంపులో విషాద ఛాయలు.. సద్గురు కన్నీటిపర్యంతం
యుద్ధ ట్యాంకులు.. ఉక్కు గోడల్లాంటివి: మంత్రి రాజ్‌నాథ్ సింగ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News