ఈవీ మార్కెట్లో టాటా జోరు
ABN , Publish Date - Aug 31 , 2026 | 03:16 AM
ఎలక్ర్టిక్ వాహన (ఈవీ) విభాగంలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ లిమిటెడ్ (టీఎంపీవీ) దూసుకుపోతోంది. ఈ విభాగంలో తన మార్కెట్ వాటాను క్రమంగా పెంచుకుంటోంది...
6 నెలల్లో బుకింగ్స్‌లో మూడు రెట్ల పెరుగుదల
పెరుగుతున్న మార్కెట్ వాటా
న్యూఢిల్లీ: ఎలక్ర్టిక్ వాహన (ఈవీ) విభాగంలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ లిమిటెడ్ (టీఎంపీవీ) దూసుకుపోతోంది. ఈ విభాగంలో తన మార్కెట్ వాటాను క్రమంగా పెంచుకుంటోంది. గత ఆరు నెలల్లో ఈవీల బుకింగ్‌లు మూడు రెట్లు పెరిగినట్లు టాటా ప్యాసింజర్ ఎలక్ర్టిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ (సీఓఓ) వివేక్ శ్రీవత్స తెలిపారు. అయితే పెరుగుతున్న డిమాండ్‌ను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోలేకపోతున్నా మని, ఉత్పత్తి సామర్థ్యం పరిమితంగా ఉండటమే ఇందుకు కారణమని చెప్పారు. గత రెండు మూడు నెలలుగా తాము ప్రతి నెలా మార్కెట్ వాటాను పెంచుకుంటున్నామని, గత ఆరు నెలల్లో తమకూ.. రెండో స్థానంలో ఉన్న కంపెనీకి మధ్య అంతరం పెరిగిందని శ్రీవత్స తెలిపారు. తమ ఈవీల బుకింగ్స్ మూడు రెట్లు పెరగటమే ఇందుకు నిదర్శనమని అన్నారు. కాగా టాటా ఉత్పత్తులపై వినియోగదారుల్లో విశ్వాసం పెరుగుతోందని, కస్టమర్ల విభిన్న అవసరాలకు తగినట్టుగా తమ వద్ద అత్యంత విస్తృత ఉత్పత్తి శ్రేణి ఉందని శ్రీవత్స చెప్పారు. వచ్చే పండగ సీజన్ బలంగా ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న జోరు సెప్టెంబరు- డిసెంబరు త్రైమాసికాన్ని పరిశ్రమ చరిత్రలో అతిపెద్ద త్రైమాసికంగా మార్చే అవకాశం ఉందని శ్రీవత్స పేర్కొన్నారు. జూన్ త్రైమాసికంలో పరిశ్రమ ఇంతకు ముందెన్నడూ లేని విధంగా వార్షిక ప్రాతిపదికన దాదాపు 46 శాతం వృద్ధిని సాధించిందన్నారు. ఈవీలు అంతకంటే ఎక్కువగా వార్షిక ప్రాతిపదికన 77 శాతం వృద్ధిని నమోదు చేశాయని చెప్పారు. జూలై, ఆగస్టు నెలల్లోనూ ఈ జోరు కొనసాగిందన్నారు. కాబట్టి వచ్చే పండగ సీజన్ సానుకూలంగా ఉంటుందని, పరిశ్రమకు ఇదే అతిపెద్ద త్రైమాసికం కానుందన్న సంకేతాలు వెలువడుతున్నాయని చెప్పారు. కాగా సెప్టెంబరు నుంచి కార్ల ధరల పెంపు నిర్ణయం.. పండగ సీజన్ డిమాండ్‌పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని శ్రీవత్స అన్నారు.
విద్యుత్ వాణిజ్య వాహనాలకు డిమాండ్
విద్యుత్ వాణిజ్య వాహనాలకు (సీవీ) డిమాండ్ బలంగా కొనసాగుతోందని, రానున్న కాలంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని టాటా మోటార్స్ ఎండీ, సీఈఓ గిరీష్ వాఘ్ పేర్కొన్నారు. అన్ని విభాగాల్లో ఇప్పటికే బలమైన ఆర్డర్ బుక్ ఉందని చెప్పారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే సెల్స్‌కు సంబంధించిన సప్లయ్ చెయిన్ అవరోధాలు ప్రస్తుత త్రైమాసికం చివరికల్లా పూర్తిగా పరిష్కారమవుతాయని కంపెనీ ఆశిస్తోందన్నారు.
ఇవి కూడా చదవండి..
సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు
ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని
తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News