శుక్రవారం నష్టాలతో ముగిసిన భాకత స్టాక్ మార్కెట్లు
ABN , Publish Date - Sep 11 , 2026 | 04:11 PM
వారాంతాన కూడా భారత ఈక్విటీ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీనమైన సంకేతాలు, ముడిచమురు ధరల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల నిధుల తరలింపు కారణంగా బెంచ్ మార్క్ సూచీలు శుక్రవారం రోజంతా ఒత్తిడిలోనే కొనసాగాయి.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 1: వారాంతంలో(శుక్రవారం) భారత ఈక్విటీ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని బలహీనమైన సంకేతాలు, ముడిచమురు (Crude Oil) ధరల పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల నిధుల తరలింపు (FII Outflows) కారణంగా బెంచ్ మార్క్ సూచీలు రోజంతా ఒత్తిడిలోనే కొనసాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 120.84 పాయింట్లు (0.16శాతం) నష్టపోయి 74,781.76 దగ్గర ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 79.70 పాయింట్లు (0.34శాతం) నష్టపోయి 23,398.10 వద్ద స్థిరపడింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా బ్రెంట్ క్రూడ్ (Brent Crude) ధరలు బారెల్ $108 దాటడం మార్కెట్ ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. అమెరికా, ఆసియా మార్కెట్లు ప్రతికూల ట్రెండ్‌లో కొనసాగడం కూడా దేశీయ సూచీలపై ప్రభావం చూపింది. ప్రధానంగా మెటల్, రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు నష్టాల్లో కూరుకుపోగా, ఐటీ, టెక్ రంగాలు స్వల్పంగా రాణించి మరింత పతనాన్ని అడ్డుకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.620 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం..
2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం