Share News

స్వల్ప లాభాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు

ABN , Publish Date - Sep 10 , 2026 | 04:19 PM

ఇవాళ (గురువారం) భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. చివర్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ 138.36 పాయింట్లు లాభపడి 74,902.59 వద్ద ముగిసింది. నిఫ్టీ 46.30 పాయింట్లు పుంజుకుని 23,477.80 దగ్గర స్థిరపడింది.

స్వల్ప లాభాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు
Sensex Gains 138 Points, Nifty Above 23,450; PSU Banks Lead

ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 10: ఇవాళ (గురువారం) భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ సెషన్ చివర్లో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలో ఒక్కసారిగా కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ (0.19శాతం) పెరిగి 138.36 పాయింట్ల లాభంతో 74,902.59 వద్ద ముగిసింది. నిఫ్టీ (0.20శాతం) పుంజుకుని 46.30 పాయింట్లతో 23,477.80 దగ్గర స్థిరపడింది.


టాప్ గెయినర్స్:

పవర్ గ్రిడ్: 2.27శాతం పెరిగి రూ.272 వద్ద నిలిచింది

యాక్సిస్ బ్యాంక్: 1.65శాతం లాభపడి రూ.1,260 వద్ద ముగిసింది

ఆల్ట్రాటెక్ సిమెంట్: 1.44శాతం పెరిగి రూ.11,053 కు చేరింది

ఎన్‌టీపీసీ (1.13శాతం), టెక్ మహీంద్రా (1.09శాతం), భారతీ ఎయిర్‌టెల్ (1.00శాతం), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (0.98శాతం) లాభపడ్డాయి.

టాప్ లూజర్స్:

హెచ్‌సీఎల్ టెక్నాలజీస్: 2.43శాతం క్షీణించి రూ.1,196.80 వద్ద అత్యధికంగా నష్టపోయింది

టాటా స్టీల్ (1.38శాతం), ట్రెంట్ (1.12శాతం), ఐటీసీ (0.84శాతం) నష్టాల్లో ముగిశాయి.

బ్రాడర్ మార్కెట్ ట్రెండ్ విషయానికొస్తే, ప్రధాన బెంచ్‌మార్క్ సూచీలు లాభపడినప్పటికీ, బ్రాడర్ మార్కెట్ (మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్) ఒత్తిడిలోనే కొనసాగింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100.. 0.38శాతం క్షీణించింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100.. 0.07శాతం నష్టపోయింది. కీలకమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలు లీడ్ తీసుకుని సూచీలను ఆదుకోగా, ఆటో, ఫార్మా, మెటల్ రంగాలు వెనుకంజవేశాయి.


ఈ వార్తలు కూడా చదవండి

కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్

ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ

Updated Date - Sep 10 , 2026 | 04:23 PM