లాభాల నుంచి నష్టాల్లోకి.. శుక్రవారం నిఫ్టీ 46, సెన్సెక్స్ 160 పాయింట్ల డౌన్
ABN , Publish Date - May 15 , 2026 | 05:07 PM
నిన్న భారీ లాభాలు, దాదాపు ఈ వారమంతా తీవ్ర ఒడుదొడుకుల్ని ఎదుర్కొన్న భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ వారాంతాన్ని(శుక్రవారం) స్వల్ప నష్టాలతో ముగించాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 161 పాయింట్లు, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో ముగిశాయి.
ఆంధ్రజ్యోతి, మే 15: మొన్న, అంతకుముందు రోజు భారీ నష్టాలు, నిన్న భారీ లాభాలు మూటగట్టుకున్న భారత స్టాక్ మార్కెట్ సూచీలు దాదాపు ఈ వారమంతా తీవ్ర ఒడుదొడుకుల్ని ఎదుర్కొన్నాయి. ఇక, ఇవాళ వారాంతాన్ని(శుక్రవారం) స్వల్ప నష్టాలతో ముగించాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 161 పాయింట్లు, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయ్యాయి.
ఉదయం సెషన్లో సెన్సెక్స్ దాదాపు 350 పాయింట్ల లాభంతో 75,765 వరకు వెళ్ళినప్పటికీ, పదకొండు గంటల తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఇవాళ్టి ట్రేడింగ్‌లో టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL), ఎస్‌బీఐ (SBI), మహీంద్రా & మహీంద్రా వంటి హెవీవెయిట్ షేర్లు 1.5శాతం నుంచి 2శాతం వరకు నష్టపోయి సూచీలను కిందకు లాగాయి.
ఇక, ఐటీ రంగంలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఆటో రంగంలో మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో ముగిసి మార్కెట్‌కు కొంత మద్దతునిచ్చాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఒక దశలో 96.14 స్థాయికి పడిపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 107 డాలర్లు దాటడం మదుపర్లను ఆందోళనకు గురిచేసింది. నిన్నటి భారీ లాభాల తర్వాత ఇన్వెస్టర్లు నేడు లాభాల స్వీకరణకు (Profit Booking) మొగ్గు చూపడం కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కరెన్సీ మార్కెట్లో రూపాయి పతనం నేటి ట్రేడింగ్‌లో కీలకాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి...
నా దేశం.. నా బాధ్యత నినాదంతో ముందుకు సాగాలి: మంత్రి కొల్లు రవీంద్ర
బంగారం ఉత్పత్తికి చిరునామాగా ఏపీ: సీఎం చంద్రబాబు