భారీ నష్టాలను చవిచూస్తోన్న భారత స్టాక్ మార్కెట్లు
ABN , Publish Date - Feb 19 , 2026 | 12:55 PM
ఇవాళ భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూస్తోంది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్ మధ్యాహ్నం ఒంటిగంట సమాయానికి 800 పాయింట్లకు పైగా పడిపోయింది. అదే సమయానికి నిఫ్టీ 230 పాయింట్లకు పైగా పతనమైంది.
ఆంధ్రజ్యోతి, ఫిబ్రవరి 19: నేడు (ఫిబ్రవరి 19) భారతీయ స్టాక్ మార్కెట్లు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి సూచీలు భారీగా పడిపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ (SENSEX) ఏకంగా 800 పాయింట్లు పతనమైంది. ఈ ఉదయం 83,969.82 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఒకానొక దశలో 82,943.49 కనిష్ఠ స్థాయికి పడిపోయింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 (NIFTY 50) కూడా 230 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. ఉదయం 10:12 గంటల సమయంలో 25,771 వద్ద ఉన్న నిఫ్టీ.. మధ్యాహ్నానికి మరింత బలహీనపడింది. స్టాక్ మార్కెట్లు నష్టపోతున్న తరుణంలో బంగారం ధరలు సానుకూలంగా కదులుతున్నాయి. మార్కెట్ కీలక సపోర్ట్ స్థాయిల కంటే కిందకు పడిపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం
శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు..
For More National News And Telugu News