నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. సెన్సెక్స్ 382, నిఫ్టీ 118 పాయింట్లు డౌన్
ABN , Publish Date - Sep 07 , 2026 | 03:49 PM
సోమవారం భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 382 పాయింట్లు, నిఫ్టీ 118 పాయింట్లు కోల్పోయాయి. రోజంతా హెచ్చుతగ్గుల మధ్య తీవ్ర ఒడుదొడుకులకు గురైన సూచీలు చివరికి నష్టాలతోనే ముగిశాయి.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 7: వారం ప్రారంభంలో భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. రోజంతా హెచ్చుతగ్గుల మధ్య తీవ్ర ఒడుదొడుకులకు గురైన సూచీలు చివరికి నష్టాలతోనే ముగిశాయి. నేటి (సోమవారం) ట్రేడింగ్‌లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బెంచ్‌మార్క్ సూచీ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) సూచీ నిఫ్టీ 50 రెండూ 0.50శాతం చొప్పున పతనమయ్యాయి.
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న క్రూడాయిల్ ధరల ప్రభావంతో భారతీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. వారంలో తొలిరోజైన సోమవారం నాడు ఐటీ, మెటల్, రియల్టీ రంగాల షేర్లలో భారీగా అమ్మకాలు జరగడంతో సూచీలు పతనమయ్యాయి.
మార్కెట్లో విక్రయాల ఒత్తిడి కారణంగా నిఫ్టీ ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలు మినహా దాదాపు అన్ని రంగాలు ఎరుపు రంగులోనే (నష్టాల్లో) ముగిశాయి. ముఖ్యంగా ఐటీ (IT), మెటల్, రియల్టీ (Realty) రంగాలు అత్యధికంగా నష్టపోయిన జాబితాలో నిలిచాయి.
మిడ్‌క్యాప్ సూచీ 0.46శాతం నష్టపోగా, స్మాల్‌క్యాప్ 100 సూచీ మాత్రం 0.08శాతం స్వల్ప లాభాన్ని దక్కించుకోగలిగింది.
అంతర్జాతీయ పరిస్థితులు.. ముడిచమురు సెగ
అమెరికా-ఇరాన్ మధ్య తీవ్రమవుతున్న మిలిటరీ ఘర్షణల నేపధ్యంలో మదుపరులు అత్యంత అప్రమత్తత పాటించారు. పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలసంధి ప్రాంతాల్లో ఇంధన రవాణాకు ఆటంకం కలుగుతుందనే ఆందోళనల మధ్య అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ (Brent Crude) ఒకానొక దశలో 0.8% పెరిగి బ్యారెల్‌కు $97 మార్కును చేరగా, WTI క్రూడ్ బ్యారెల్‌కు $92 వద్ద ట్రేడైంది. యూరప్ సహజ వాయువు (Gas) ధరలు కూడా 4.2శాతం వరకు పెరిగాయి. భారత మార్కెట్లు నష్టపోయినప్పటికీ, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్ పరిశ్రమల మద్దతుతో ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్
ముగింపు: 76,132.81
నష్టం: 382.62 పాయింట్లు (-0.50%)
ప్రారంభం : 76,446.05
రోజువ్యవధిలో గరిష్టం: 76,477.19
రోజువ్యవధిలో కనిష్టం: 75,970.52
గత ముగింపు : 76,515.43
ఎన్ఎస్ఈ నిఫ్టీ 50
ముగింపు: 23,779.15
నష్టం: 118.55 పాయింట్లు (-0.50%)
ప్రారంభం: 23,883.15
రోజువ్యవధిలో గరిష్టం: 23,890.00
రోజువ్యవధిలో కనిష్టం: 23,737.90
గత ముగింపు (Previous Close): 23,897.70
ఇవి కూడా చదవండి...
LP మీటింగ్ కూడా కేసీఆర్ ఫామ్‌హౌస్‌లోనే చేస్తారా: మంత్రి సీతక్క
రాంచందర్‌రావు అరెస్ట్.. తోపులాట.. ఉద్రిక్తత