భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు.. గ్యాప్-డౌన్ ఓపెనింగ్
ABN , Publish Date - Mar 30 , 2026 | 09:29 AM
భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండే నమోదైంది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 300 పాయింట్ల వరకు పతనమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి.
ఆంధ్రజ్యోతి, మార్చి 30: భారతీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ (సోమవారం) భారీ నష్టాల్లో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 300 పాయింట్ల వరకు పతనమయ్యాయి. అంతర్జాతీయ పరిణామాలు భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చడం అంతర్జాతీయ మార్కెట్లను వణికించింది. ముఖ్యంగా ఇరాన్ చేసిన క్షిపణి దాడులు గల్ఫ్ ప్రాంతంలో అశాంతిని పెంచాయి.
యుద్ధం కారణంగా సరఫరాకు ఆటంకం కలుగుతుందనే భయంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. చమురు ధరలు పెరిగితే భారతదేశం వంటి దేశాలపై ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరుగుతుంది. మరోవైపు, అమెరికా ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, అక్కడ వడ్డీ రేట్లపై నెలకొన్న సందిగ్ధత వల్ల డౌ జోన్స్, నాస్‌డాక్ వంటి సూచీలు భారీగా నష్టపోయాయి. దీని ప్రభావం ఆసియా మార్కెట్లన్నింటిపై పడింది.
ఇవి కూడా చదవండి..
రైతన్నలకు సాయం, మహిళలకు నెలవారీ గ్రాంట్... డీఎంకే మేనిఫెస్టో
వాళ్లు వచ్చారో మీరు మాంసం కూడా తినలేరు: మమతా బెనర్జీ