Share News

‘బేర్‌’ పట్టులో బులియన్‌ మార్కెట్‌

ABN , Publish Date - Oct 26 , 2026 | 03:54 AM

ఈ వారం కూడా బులియన్‌ మార్కెట్‌కు పెద్దగా కలిసొచ్చే సూచనలు కనిపించడం లేదు. గత వారం దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్లో పసిడి...

‘బేర్‌’ పట్టులో బులియన్‌ మార్కెట్‌

ఈ వారం మరింత తగ్గే అవకాశం

న్యూఢిల్లీ: ఈ వారం కూడా బులియన్‌ మార్కెట్‌కు పెద్దగా కలిసొచ్చే సూచనలు కనిపించడం లేదు. గత వారం దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్లో పసిడి ధర 4 శాతం, వెండి ధర 7.14 శాతం నష్టపోయాయి. బ్యారల్‌ చమురు ధర ఇప్పటికే 117 డాలర్లకు చేరింది. పదేళ్ల కాలపరిమితి ఉండే అమెరికా ప్రభుత్వ రుణ పత్రాలపై రాబడులు ఇంకా 5 శాతానికి దగ్గరలో ఉన్నాయి. మరోవైపు పెరుగుతున్న ధరల సెగ తట్టుకునేందుకు అమెరికా, యూరప్‌ జపాన్‌ దేశాల కేంద్ర బ్యాంకు లు ఈ వారం వడ్డీ రేట్లు మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే బంగారం, వెండి ధరలు మరింత దిద్దుబాటుకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

పెట్టుబడులకు రెట్టింపు లాభాలు

మీ-సేవలోడ్రైవింగ్‌ లైసెన్సు వీడియో!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 03:54 AM