పేటీఎంకు షాక్.. పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన ఆర్‌బీఐ
ABN , Publish Date - Apr 24 , 2026 | 09:41 PM
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గట్టి షాకిచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను రద్దు చేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఇకపై కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గట్టి షాకిచ్చింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను రద్దు చేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఇకపై కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ఇప్పటికే గత కొంతకాలంగా ఈ బ్యాంక్‌పై ఆర్సీబీ కఠిన చర్యలు తీసుకుంటూ వస్తోన్న సంగతి తెలిసిందే. కొత్త కస్టమర్లను చేర్చుకోవడం, డిపాజిట్లు స్వీకరరించడం వంటి కార్యకలాపాలపై ముందుగానే నిషేధం విధించింది. 2022లో ప్రారంభమైన ఈ నియంత్రణ చర్యలు.. 2024లో మరింత కఠినంగా మారాయి.
డిపాజిటర్లు, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా బ్యాంక్ మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తోందని, పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ను నిబంధనలను అనుసరించడం లేదని ఆర్‌బీఐ తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంక్‌ను కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదని తేల్చిన ఆర్‌బీఐ.. లైసెన్స్‌ను రద్దు చేసింది. బ్యాంకింగ్ సేవల మూసివేతపై హైకోర్టులో దరఖాస్తు చేస్తామని ఆర్‌బీఐ వెల్లడించింది. అయితే బ్యాంక్ వద్ద ఉన్న నిధులు డిపాజిటర్లకు చెల్లించడానికి సరిపోతాయని భరోసా ఇచ్చింది. మొత్తానికి డిజిటల్ ఫైనాన్స్ రంగంలో ఈ పరిణామం పెద్ద షాక్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో వినియోగదారులు, పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: గుజరాత్ టైటాన్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన ఆర్సీబీ
ఆ రెండు జట్లు టాప్‌లో ఉండటానికి వారిద్దరే కారణం: పుజారా