Share News

లాభనష్టాలతో దోబూచులు.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు..

ABN , Publish Date - May 07 , 2026 | 10:09 AM

బుధవారం లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు గురువారం కూడా లాభాలతోనే మొదలయ్యాయి. అయితే ఆ తర్వాత కిందకు దిగి వచ్చాయి. ఆటోమొబైల్, మెటల్ రంగాలు లాభాల్లో ఉన్నాయి. అయితే రియాల్టీ రంగం సూచీలను వెనక్కి లాగుతోంది.

లాభనష్టాలతో దోబూచులు.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు..
Stock Market

బుధవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు గురువారం కూడా లాభాలతోనే మొదలయ్యాయి. అయితే ఆ తర్వాత కిందకు దిగి వచ్చాయి. ఆటోమొబైల్, మెటల్ రంగాలు లాభాల్లో ఉన్నాయి. అయితే రియాల్టీ రంగం సూచీలను వెనక్కి లాగుతోంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూచీలు లాభనష్టాలతో దోబూచులాడుతున్నాయి. ప్రస్తుతం స్వల్ప లాభాల్లో కనొసాగుతున్నాయి. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ 94.79గా ఉంది (Indian stock market).


గత సెషన్ ముగింపు (77,958)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు 350 పాయింట్ల లాభంతో 78,339 వద్ద మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కిందకు దిగి వచ్చింది. ఆరంభ లాభాలను కోల్పోయింది. ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 106 పాయింట్ల లాభంతో 78,065 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 39 పాయింట్ల లాభంతో 24,370 వద్ద కదలాడుతోంది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో పేటీఎమ్, పాలీక్యాబ్, సీజీ పవర్, శ్రీ సిమెంట్స్, హిటాచీ ఎనర్జీ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). గోద్రేజ్ కన్జ్యూమర్, కేపీఐటీ టెక్, పీబీ ఫిన్‌టెక్, కేఈఐ ఇండస్ట్రీస్, బ్లూ స్టార్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 162 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 63 పాయింట్ల లాభంతో ఉంది.


ఇవి కూడా చదవండి..

భారత్ మళ్లీ దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది: పాక్ రక్షణ మంత్రి


పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..

Updated Date - May 07 , 2026 | 10:09 AM