సూచీలకు భారీ లాభాలు.. 750 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:54 PM
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగబోతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఆ ప్రభావం దేశీయ సూచీలపై కూడా పడింది. క్రూడాయిల్ ధరలు తగ్గడం కూడా సూచీలకు పాజిటివ్‌గా మారింది. మరోవైపు దాదాపు ఆసియా మార్కెట్లన్నీ లాభాల బాటలోనే సాగాయి.
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగబోతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఆ ప్రభావం దేశీయ సూచీలపై కూడా పడింది. క్రూడాయిల్ ధరలు తగ్గడం కూడా సూచీలకు పాజిటివ్‌గా మారింది. మరోవైపు దాదాపు ఆసియా మార్కెట్లన్నీ లాభాల బాటలోనే సాగాయి. అలాగే బ్యాంకింగ్ రంగం మెరవడం కూడా సానుకూలంగా మారింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలతో రోజును ముగించాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (78,520)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం 100 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. మధ్యాహ్నం తర్వాత ఆ లాభాలు మరింత పెరిగాయి. చివరకు సెన్సెక్స్ 753 పాయింట్ల లాభంతో 79,273 వద్ద రోజును ముగించింది. చాలా రోజుల తర్వాత 79 వేల మార్క్‌ను దాటింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 211 పాయింట్ల లాభంతో 24,576 వద్ద స్థిరపడింది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్, నెస్ట్లే, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, నిప్పాన్, మణప్పురం ఫైనాన్స్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, పాలీక్యాబ్, మ్యాక్స్ ఫైనాన్సియల్స్, సమ్మన్ క్యాపిటల్, ఐసీఐసీఐ లాంబార్డ్ మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 789 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 295 పాయింట్లు ఆర్జించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 93.49గా ఉంది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌తో చర్చలకు రమ్మంటే వస్తా: డొనాల్డ్ ట్రంప్
భారతీయ వీసా దరఖాస్తుదారులు.. గుడ్‌న్యూస్ చెప్పిన కెనడా..