Share News

బడ్జెట్ సమావేశాల లైవ్ అప్డేట్స్..

ABN , First Publish Date - Feb 01 , 2026 | 09:19 AM

బడ్జెట్ 2026-27 సమాచారాన్ని ఇక్కడ చదవండి..

బడ్జెట్ సమావేశాల లైవ్ అప్డేట్స్..
Union Budget 2026

Live News & Updates

  • Feb 01, 2026 16:27 IST

    ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా బడ్జెట్ ఉంది: సీఎం చంద్రబాబు

    • మహిళలు, యువతకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు.

    • రాబోయే రోజుల్లో ఏఐ ద్వారా మరింత వేగం పెరిగే అవకాశం ఉంది.

    • ఏపీకి మూడు హైస్పీడ్ కారిడార్‌లు రానున్నాయి.

    • హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ కారిడార్‌లో అనంతపురం, కర్నూల్ వస్తాయి.

    • హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్‌లో అమరావతి, తిరుపతి వస్తాయి.

    • బెంగళూరు-చెన్నై హైస్పీడ్ కారిడార్‌లో చిత్తూరు జిల్లా పలమనేరు రానుంది.

    • బెంగళూరు-చెన్నై కారిడార్‌లో తిరుపతిని కూడా కలపాలని కోరుతాం.

    • అరకులో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవడం మంచి పరిణామం.

  • Feb 01, 2026 16:19 IST

    భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 1,547 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్.

    • 495 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ.

  • Feb 01, 2026 16:13 IST

    భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోంది: కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

    • పర్యాటకం, సాంస్కృతిక రంగాలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

    • పర్యాటకరంగంలో 10వేల మంది గైడ్‌లకు శిక్షణ ఇచ్చే అంశాన్ని బడ్జెట్‌లో పేర్కొన్నందుకు ధన్యవాదాలు.

  • Feb 01, 2026 16:06 IST

    కేంద్ర బడ్జెట్‌లో చాలా తక్కువ వివరాలు వెల్లడించారు: కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్

    • ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద గురించి ప్రస్తావన ఉంటుందని ఆశించాం.

    • ఆయుర్వేదానికి కేరాఫ్‌గా ఉన్న కేరళలో ఆ సంస్థను ఏర్పాటు చేస్తారనుకున్నాం.

    • బడ్జెట్ ప్రసంగంలో కేరళ పేరు ఎక్కడా వినిపించలేదు.

  • Feb 01, 2026 16:06 IST

    బడ్జెట్‌లో కొత్తదనం లేదు: మల్లికార్జున ఖర్గే

    • ప్రస్తుత ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేలా ఈ బడ్జెట్‌ లేదు.

    • ఈ బడ్జెట్‌లో పేదలకు ఇచ్చిందేమీ లేదు.

    • వాణిజ్య అనిశ్చితిపై బడ్జెట్‌లో ప్రస్తావనే లేదు.

    • పడిపోతున్న రూపాయి విలువను పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పలేదు.

  • Feb 01, 2026 15:59 IST

    కేంద్ర బడ్జెట్ పూర్తిగా నిరాశ పరిచింది: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి

    • పోలవరం, జలజీవన్ మిషన్‌కు కూడా నిధులు తగ్గించారు.

    • దాదాపు 50 వేల కోట్ల రూపాయలు తగ్గించారు.

  • Feb 01, 2026 15:50 IST

    కేంద్ర బడ్జెట్‌పై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలు

    • కేంద్ర ప్రభుత్వం దేశాన్ని తప్పుదారి పట్టింది.

    • బెంగాల్‌కు రావాల్సిన నిధులను కట్ చేశారు.

    పూర్తికథనం

  • Feb 01, 2026 15:35 IST

    సామాన్యుల అభ్యున్నతి కోసం రూపొందించిన బడ్జెట్: గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్

    • ఆత్మనిర్భర భారత్‌కు ఈ బడ్జెట్‌ ప్రేరణనిస్తుంది.

  • Feb 01, 2026 15:30 IST

    బడ్జెట్‌పై రేపు మాట్లాడుతాను: రాహుల్ గాంధీ

  • Feb 01, 2026 15:23 IST

    బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యత..

    • అమరావతి రాజధాని అభివృద్ధికి (ADB నిధులు)రూ. 1,128.91కోట్లు.

    • అమరావతి సమీకృత పట్టణాభివృద్ధి(IBRD) కోసం రూ. 432.09కోట్లు.

    • ఏపీ గ్రామీణ రహదారి ప్రాజెక్టులకు రూ. 500.99కోట్లు.

    • ఏపీ పట్టణ తాగు, మురుగు నీటిపారుదల నిర్వహణకు రూ. 800కోట్లు.

    • ఏపీలో ప్రకృతి వ్యయసాయానికి రూ. 155.32కోట్లు.

    • ఏపీలో రోడ్లు, వంతెనల పునర్‌నిర్మాణం కోసం రూ. 350కోట్లు.

  • Feb 01, 2026 15:20 IST

    బడ్జెట్‌పై మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్

  • Feb 01, 2026 15:18 IST

    దేశాభివృద్ధిలో రాజీ పడకుండా బడ్జెట్ ఉంది: ఎంపీ ఈటల

    • రూ. 53 లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ ఉంది.

    • దేశ ప్రజల హితమే ధ్యేయంగా బడ్జెట్.

    • రూ. 1.50 లక్షల కోట్లతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు.

    • యువతను ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది.

    • దేశంలోని అన్ని రంగాలకు పెద్ద పీట వేశారు.

  • Feb 01, 2026 15:12 IST

    వికసిత్ భారత్-2047 లక్ష్యంగా బడ్జెట్: మోదీ

    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడో స్థానమే లక్ష్యం

    • యువత, పరిశ్రమలకు లబ్ధి చేకూరేలా బడ్జెట్.

    • ఆత్మనిర్బర్ భారత్‌కు రోడ్‌ మ్యాప్ ఈ బడ్జెట్.

    • ఇన్‌ఫ్రా రంగానికి ఉతమిచ్చేలా బడ్జెట్ రూపకల్పన.

    • ప్రస్తుత, భవిష్యత్ అవసరాలు లక్ష్యంగా బడ్జెట్.

    • ఈ బడ్జెట్‌తో ద్రవ్యోల్బణం తగ్గుతుంది.

    పూర్తికథనం

  • Feb 01, 2026 15:11 IST

    కేంద్రం నుంచి రూపాయి పోక

    • రాష్ట్రాలకు పన్నుల్లో వాటా 22 శాతం.

    • రుణాలకు వడ్డీ చెల్లింపులు 20 శాతం.

    • కేంద్ర ప్రభుత్వ పథకాలు 17 శాతం.

    • రక్షణ రంగానికి 11 శాతం.

    • కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు 8 శాతం.

    • ఆర్ధిక సంఘం, ఇతర బదిలీలు 7 శాతం.

    • ఇతర ఖర్చులకు 7 శాతం.

    • ప్రధాన సబ్సిడీలకు 6 శాతం.

    • సివిల్‌ పెన్షన్లకు 2 శాతం.

  • Feb 01, 2026 15:10 IST

    కేంద్ర ప్రభుత్వానికి రూపాయి రాక

    • అప్పుల ద్వారా ఆదాయం 24 శాతం.

    • ఇన్‌కమ్ ట్యాక్స్ ద్వారా 21 శాతం.

    • కార్పొరేషన్‌ పన్ను ద్వారా 18 శాతం.

    • జీఎస్టీ, ఇతర పన్నుల రూపేణా 15 శాతం.

    • పన్నేతర రెవెన్యూ 10 శాతం.

    • ఎక్సైజ్‌ డ్యూటీ 6 శాతం.

    • కస్టమ్స్‌ 4 శాతం.

    • రుణం లేని మూలధనం 2 శాతం.

  • Feb 01, 2026 15:10 IST

    బడ్జెట్‌లో ప్రధాన రంగాలకు కేటాయింపులు

    • రవాణా శాఖ: రూ.5,98,520 కోట్లు

    • రక్షణ శాఖ: రూ.5,94,585 కోట్లు

    • గ్రామీణాభివృద్ది: రూ.2,73,108 కోట్లు

    • హోం శాఖ: రూ.2,55,234 కోట్లు

    • వ్యవసాయం, అనుబంధం: రూ.1,62,671 కోట్లు

    • విద్య: రూ.1,39,289 కోట్లు

    • విద్యుత్‌: రూ.1,09,029 కోట్లు

    • ఆరోగ్యం: రూ.1,04,599 కోట్లు

    • పట్టణాభివృద్ది: రూ.85,522 కోట్లు

    • ఐటీ, టెలికం: రూ.74,560 కోట్లు

    • వాణిజ్య, పరిశ్రమ: రూ.70,296 కోట్లు

    • సామాజికాభివృద్ది: రూ.62,362 కోట్లు

    • సైన్స్‌ విభాగాలు: రూ.55,756 కోట్లు

    • పన్నుల పాలన: రూ.45,500 కోట్లు

    • విదేశాంగ: రూ.22,119 కోట్లు

    • ఆర్ధిక విభాగం: రూ.20,649 కోట్లు

    • ఈశాన్య రాష్ట్రాలకు: రూ.6,812 కోట్లు

  • Feb 01, 2026 13:28 IST

    మూలధన వ్యయం రూ.12.20 లక్షల కోట్లు

    • 2026-27 ద్రవ్యలోటు 4.3 శాతం అంచనా

    • గతేడాదితో పోలిస్తే 0.1 శాతం తగ్గిన ద్రవ్యలోటు

    • 2027లో రూ.28.70లక్షల కోట్ల పన్ను వసూళ్ల అంచనా

    • రక్షణ రంగం రూ.5,94,585 కోట్లు, గ్రామీణాభివృద్ధి రూ.2,73,108కోట్లు

    • హోంశాఖ రూ.2,55,234కోట్లు, విద్యా రంగం రూ.1,39,289కోట్లు

    • వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1,62,671కోట్లు

    • ఇంధన రంగం రూ.1,09,029కోట్లు, ఆరోగ్య రంగం రూ.1,04,599కోట్లు

    • రవాణా రంగం రూ.5,98,520కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.85,522కోట్లు

  • Feb 01, 2026 13:03 IST

    ముగిసిన బడ్జెట్ ప్రసంగం

    • ముగిసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం

  • Feb 01, 2026 12:37 IST

    తగ్గనున్న ధరలు..

    • తగ్గనున్న సోలార్, లెదర్ ఉత్పత్తుల ధరలు

    • బీడీలు, బ్యాటరీలపై తగ్గనున్న రేట్లు

    • CNG, బయోగ్యాస్, క్యాన్సర్ మందుల ధరలు తగ్గింపు

  • Feb 01, 2026 12:31 IST

    స్టాక్‌మార్కెట్లపై బడ్జెట్ ప్రభావం

    • భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్‌మార్కెట్లు

    • సెన్సెక్స్ 1,610, నిఫ్టీ 540 పాయింట్లకు పైగా నష్టం

  • Feb 01, 2026 12:30 IST

    స్లాబ్‌లు యథాతథం..

    • ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ స్లాబ్‌లు యథాతథం: నిర్మల

    • ట్యాక్స్‌ల్లో ఎలాంటి మార్పు లేదు: నిర్మల

  • Feb 01, 2026 12:24 IST

    చిన్న మదుపరుల ప్రయోజనం కోసం కేంద్రం కీలక నిర్ణయం

    • కంపెనీల బైబ్యాక్ విధానాలకు శరాఘాతం: ఆర్థిక మంత్రి నిర్మల

    • కంపెనీల బైబ్యాక్ కొనుగోళ్లపై 22శాతం పన్ను: నిర్మల

    • నాన్ కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 30శాతం పన్ను: నిర్మల

  • Feb 01, 2026 12:23 IST

    AIకి ప్రోత్సాహకం.. 2047 దిశగా అడుగులు: నిర్మల

    • న్యూఇండియాకు AI క్వాంటమ్: నిర్మల

    • భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటు సంస్థలకు ప్రోత్సాహకం: నిర్మల

    • 2047 వరకు డేటా సెంటర్ల ఏర్పాటు సంస్థలకు ట్యాక్స్ హాలిడే: నిర్మల

    • ట్యాక్స్ హాలిడేతో క్లౌడ్ సేవల సంస్థలకు ప్రయోజనం: నిర్మల

  • Feb 01, 2026 12:14 IST

    మూలధన వ్యయం రూ.12.20 లక్షల కోట్లు: నిర్మల

    • 2026-27 ద్రవ్యలోటు 4.3 శాతం అంచనా: నిర్మల

    • గతేడాదితో పోలిస్తే 0.1 శాతం తగ్గిన ద్రవ్యలోటు: నిర్మల

  • Feb 01, 2026 12:12 IST

    ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఐటీ చట్టం అమలు: నిర్మల

    • 2027లో రూ.28.70 లక్షల కోట్ల పన్ను వసూళ్లు అంచనా

    • చిన్నపన్ను చెల్లింపుదారుల కోసం ప్రత్యేక పథకం

  • Feb 01, 2026 12:10 IST

    విదేశీ టూర్ ప్యాకేజీలపై TCS తగ్గింపు

    • చదువులు, వైద్యంపై TCS 5 శాతం నుంచి 2శాతం తగ్గింపు

    • మ్యాన్‌పవర్ సరఫరా చేసే సంస్థలపై TDS తగ్గింపు

  • Feb 01, 2026 12:09 IST

    ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ చట్టం: కేంద్ర మంత్రి నిర్మల

    • ట్యాక్స్ నిబంధనల సడలింపు: కేంద్ర మంత్రి నిర్మల

    • త్వరలో అందుబాటులోకి సరళతరం చేసిన ఫారాలు: కేంద్ర మంత్రి నిర్మల

    • ప్రజలే నేరుగా ఐటీ ఫైల్ చేసేలా మార్పులు: కేంద్ర మంత్రి నిర్మల

    • విదేశీ ఆస్తుల ప్రకటనకు వన్ టైమ్ స్కీమ్: నిర్మల

    • మార్చి 31 వరకు ఐటీ చెల్లింపునకు గడువు: నిర్మల

    • జులై 31 వరకు అందుబాటులో ITR 1, ITR2: నిర్మల

  • Feb 01, 2026 12:02 IST

    ఖేలో ఇండియా మిషన్‌లో భాగంగా క్రీడల అభివృద్ధి: నిర్మల

    • AI ప్రభావం అంచనాపై హైలెవల్ స్టాండింగ్ కమిటీ: నిర్మల

    • ఏ రంగాలపై AI ప్రభావం ఎంత అని కమిటీ సర్వే: నిర్మల

    • కొత్తగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఏర్పాటు: నిర్మల

    • కొబ్బరి ఉత్పత్తి కోసం.. కొబ్బరి ప్రోత్సాహక పథకం: నిర్మల

    • తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల పెంపకానికి ప్రోత్సాహం: నిర్మల

  • Feb 01, 2026 12:02 IST

    ఒడుదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు

    • బడ్జెట్ వేళ తీవ్ర ఒడుదొడుకుల్లో భారత స్టాక్ మార్కెట్లు

    • అల్లకల్లోలంగా మారిన సూచీలు

    • ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు

    • ఆపై వేగంగా పుంజుకుని, అంతే వేగంగా పడిలేస్తోన్న సూచీలు

  • Feb 01, 2026 11:50 IST

    పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తాం: ఆర్థిక మంత్రి నిర్మల

    • జాతీయ పర్యాటక రంగ సంస్థ ఏర్పాటు: నిర్మల

    • 20 పర్యాటక ప్రాంతాల్లో 10వేల మంది గైడ్‌ల నియామకం

    • సూక్ష్మ పరిశ్రమలకు రూ.2వేల కోట్లు కేటాయింపు: నిర్మల

    • స్వయం సమృద్ధి భారతం పేరుతో రూ.2వేల కోట్ల ఫండ్ ఏర్పాటు: నిర్మల

    • ప్రభుత్వ కొనుగోలు ద్వారా MSMEలకు చేయూత: నిర్మల

    • 15 పురావస్తు ప్రాంతాల అభివృద్ధి: నిర్మల

    • పులికాట్‌ సరస్సుకు ప్రాధాన్యం ఇచ్చిన కేంద్రం: నిర్మల

    • పులికాట్‌ పక్షులను వీక్షించేందుకు ప్రత్యేక సౌకర్యాలు: నిర్మల

  • Feb 01, 2026 11:49 IST

    విదేశాల్లో ఉంటున్న భారతీయులకు గుడ్‌న్యూస్

    • భారత్ స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడుల పరిమితి పెంపు

    • మూలధన వ్యయం రూ.12.2లక్షల కోట్లకు పెంపు: నిర్మల

    • 5లక్షల జనాభా దాటిన నగరాలపై ప్రత్యేక దృష్టి: నిర్మల

  • Feb 01, 2026 11:47 IST

    దేశంలో మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహిస్తాం: కేంద్రమంత్రి నిర్మల

    • దేశంలో మెడికల్ హబ్‌లు, ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం: కేంద్రమంత్రి నిర్మల

    • ప్రైవేట్ సెక్టార్‌తో కలిసి మెడికల్ హబ్‌ల ఏర్పాటు: నిర్మల

    • మూడు ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీలను తీసుకొస్తాం: నిర్మల

    • సంప్రదాయ వైద్య పరిశోధనకు జామ్‌నగర్‌లో పరిశోధన కేంద్రం

    • ప్రైవేట్ రంగంలో పశువైద్య డయాగ్నోస్టిక్: నిర్మల

    • యువత కోసం వైద్య రంగంలో కొత్త కోర్సులు: నిర్మల

  • Feb 01, 2026 11:39 IST

    కొత్తగా ఏడు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లు

    • హైదరాబాద్‌-పుణె, హైదరాబాద్‌- బెంగళూరు మధ్య కారిడార్లు

    • హైదరాబాద్-చెన్నై, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగుడి కారిడార్లు

    • కొత్తగా హైటెక్ టూల్ రూమ్స్ ఏర్పాటు: నిర్మల

    • పరిశ్రమలు-విద్యాసంస్థలకు అనుసంధానం: నిర్మల

  • Feb 01, 2026 11:38 IST

    మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2లక్షల కోట్లు కేటాయింపు

    • వారణాసి, పట్నాలో షిప్ రిపేరింగ్ సెంటర్ల ఏర్పాటు

    • వచ్చే ఐదేళ్లలో కొత్త 20 జలమార్గాల అభివృద్ధి

    • బెంగాల్-గుజరాత్ వరకు కొత్తగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్

  • Feb 01, 2026 11:30 IST

    దేశంలో కొత్తగా మెగా టెక్స్‌టైల్స్ పార్క్‌లు ఏర్పాటు: నిర్మల

    • ఖాదీ, హ్యాండ్లూమ్, హస్తకళల ప్రోత్సాహకానికి కొత్త పథకం: నిర్మల

    • 200 పారిశ్రామిక క్లస్టర్స్ ఆధునీకరణకు చేయూత: నిర్మల

    • నాణ్యత కలిగిన క్రీడా వస్తువుల తయారీకి ప్రత్యేక పథకం: నిర్మల

  • Feb 01, 2026 11:30 IST

    ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తున్నాం: నిర్మల

    • దేశంలో కొత్త 3 NIPERలు ఏర్పాటు: నిర్మల

    • ప్రస్తుతం ఉన్న NIPERలను ఆధునీకరిస్తాం: నిర్మల

    • రూ.10వేల కోట్లతో వచ్చే ఐదేళ్లకు బయోఫార్మా శక్తి పథకం: నిర్మల

    • ఫార్మా, విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో కొత్త విద్యాసంస్థలు

  • Feb 01, 2026 11:21 IST

    రూ.10వేల కోట్లతో వచ్చే ఐదేళ్లకు బయోఫార్మా శక్తి పథకం: కేంద్రమంత్రి నిర్మల

    • ఫార్మా విద్యా, పరిశోధనకు జాతీయస్థాయి విద్యాసంస్థలు: కేంద్రమంత్రి నిర్మల

    • మూడు కెమికల్‌ రీసెర్చ్‌ పార్కులు, 2 హైటెక్‌ టెక్నాలజీ రూమ్స్‌: కేంద్రమంత్రి నిర్మల

    • సెమీ కండక్టర్‌ మిషన్‌కు భారీ కేటాయింపులు: కేంద్రమంత్రి నిర్మల

    • కేరళ, తమిళనాడు, ఏపీలో రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ కారిడార్స్‌: కేంద్రమంత్రి నిర్మల

    • ఇండియా సెమీ కండక్టర్‌ మిషన్‌ 2.0 కోసం రూ.40వేల కోట్లు: నిర్మల

  • Feb 01, 2026 11:15 IST

    ప్రజల ఆకాంక్షలు అందుకోవడమే లక్ష్యం: కేంద్రమంత్రి నిర్మల

    • నిలకడగా అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు: కేంద్రమంత్రి నిర్మల

    • ఇది ప్రధాని ఆలోచనలను ఆచరణలో పెట్టే బడ్జెట్: నిర్మల

    • ఆర్థిక స్థిరాభివృద్ధికి ప్రధానంగా 3 అంశాలు: నిర్మల

    • సమ్మిళిత అభివృద్ధి, వృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, సబ్‌ కా సాత్ సబ్‌ కా వికాస్: ఆర్థిక మంత్రి నిర్మల

    • పారిశ్రామికాభివృద్ధి, MSMEలను ఛాంపియన్ చేయడం మా లక్ష్యం: నిర్మల

    • నిర్మాణాత్మక లక్ష్యాలతో వీటిని సాధిస్తాం: నిర్మల

  • Feb 01, 2026 11:13 IST

    కేంద్రమంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగం..

    • 7శాతం గ్రోత్ రేట్‌తో ముందుకు సాగుతున్నాం: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

    • వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నాం: నిర్మలా సీతారామన్

    • ఈ బడ్జెట్.. యువశక్తి బడ్జెట్: నిర్మలా సీతారామన్

    • ప్రపంచ మార్కెట్‌తో పోటీపడేలా బడ్జెట్: నిర్మల

    • ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులున్నా.. ముందుకెళ్తున్నాం: నిర్మల

    • ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ముందుకుసాగుతాం: నిర్మల

    • భవిష్యత్తులో ఎగుమతులపై ఆధారపడటం తగ్గించుకుంటాం: నిర్మల

  • Feb 01, 2026 11:07 IST

    ఊపందుకున్న స్టాక్ మార్కెట్లు

    • బడ్జెట్ 2026-27 సమర్పణకు ముందు ఊపందుకున్న స్టాక్ మార్కెట్లు

    • బడ్జెట్ ప్రెజెంటేషన్‌కు ముందు ఆదివారం ఉదయం జోరందుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు

    • లాభాలతో ట్రేడ్ అవుతున్న బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ

  • Feb 01, 2026 11:05 IST

    బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మల

    • లోక్‌సభలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మల

    • వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్‌

  • Feb 01, 2026 10:44 IST

    బడ్జెట్-2026కి ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్

    • ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్‌లో ఆమోదం

    • ఇప్పటికే బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    • మరికాసేపట్లో బడ్జెట్‌ను లోక్ సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి నిర్మల

  • Feb 01, 2026 10:19 IST

    పార్లమెంట్‌కు చేరుకున్న ప్రధాని, కేంద్ర మంత్రులు

    • పార్లమెంట్ వద్దకు చేరుకున్న ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్..

    • హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పలువురు మంత్రులు

  • Feb 01, 2026 10:16 IST

    బడ్జెట్ వేళ మరోసారి ప్రత్యేకాకర్షణగా నిలిచిన ఆర్థిక మంత్రి చీర

    • ఏటా బడ్జెట్‌ వేళ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోన్న నిర్మలమ్మ చీర

    • ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ధరించే చీరపైనే అందరి ఫోకస్

    • ఈ ఏడాది కాంజీవరం పట్టు చీరలో పార్లమెంటుకు విచ్ఛేసిన విత్త మంత్రి

    పూర్తి కథనం

  • Feb 01, 2026 10:13 IST

    కేంద్ర బడ్జెట్-2026 సైకత శిల్పం అదుర్స్..

    • ఒడిశా: పూరీ బీచ్‌లో కేంద్ర బడ్జెట్-2026 సైకత శిల్పం

    • ఇసుక శిల్పాన్ని రూపొందించిన శాండ్ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్

    • కేంద్ర బడ్జెట్-2026కు స్వాగతం పలుకుతూ సైకత శిల్పం

  • Feb 01, 2026 10:03 IST

    బడ్జెట్‌కు రాష్ట్రపతి ఆమోదం

    • బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

    • కేంద్రమంత్రి నిర్మలకు పెరుగు, చక్కెర తినిపించిన రాష్ట్రపతి

  • Feb 01, 2026 09:37 IST

    మోదీని కలవనున్న నిర్మలా సీతారామన్

    • ఉ.10:15కి మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ

    • బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేంద్ర కేబినెట్

  • Feb 01, 2026 09:25 IST

    రాష్ట్రపతి భవన్‌కు నిర్మల

    • ఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల

    • రాష్ట్రపతికి బడ్జెట్‌ సమర్పించి అనుమతి తీసుకోనున్న నిర్మల

  • Feb 01, 2026 09:20 IST

    రాష్ట్రపతిని కలవనున్న నిర్మల

    • కాసేపట్లో రాష్ట్రపతిని కలవనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల

    • రాష్ట్రపతికి బడ్జెట్‌ సమర్పించి అనుమతి తీసుకోనున్న నిర్మల

  • Feb 01, 2026 09:19 IST

    ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మల

    • వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్‌

    • తొలిసారి ఆదివారం బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నిర్మల

    • ఆత్మనిర్భర్‌, వికసిత భారత్‌ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌