Share News

ఆఫ్రికాకు హెటెరో హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌

ABN , Publish Date - Nov 27 , 2026 | 03:14 AM

హెచ్‌ఐవీ నివారణకు ఉపయోగించే జెనరిక్‌ ఇంజెక్షన్‌ లెనకాపవీర్‌ను ఆఫ్రికాకు సరఫరా చేయడం...

ఆఫ్రికాకు హెటెరో హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌

న్యూఢిల్లీ: హెచ్‌ఐవీ నివారణకు ఉపయోగించే జెనరిక్‌ ఇంజెక్షన్‌ లెనకాపవీర్‌ను ఆఫ్రికాకు సరఫరా చేయడం ప్రారంభించినట్టు హైదరాబాద్‌కు చెందిన ఫార్మా సంస్థ హెటెరో గురువారం తెలిపింది. తొలుత జాంబియా, ఉగాండా, జింబాబ్వేలకు 3 లక్షల వయల్స్‌ను సరఫరా చేయాలన్న ప్రణాళికతో ఉన్నట్టు పేర్కొంది. లెక్సాపిర్‌, క్యాప్విక్‌ బ్రాండ్‌నేమ్స్‌తో ప్రవేశపెట్టిన ఈ ఇంజెక్షన్‌ను ఆరు నెలలకు ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది. జెనరిక్‌ ఓరల్‌ ట్యాబ్లెట్లను వచ్చే ఏడాది జనవరి వరకు ప్రవేశపెట్టాలని కంపెనీ భావిస్తోంది. 2027 ప్రారంభంలో మరో పది ఆఫ్రికా దేశాలకు ఈ ఔషధాన్ని సరఫరా చేయడమేకాకుండా దిగువ, మధ్య ఆదాయ దేశాలకు విస్తరించాలన్న యోచనలో ఉంది. రానున్న కాలంలో ఈ ఔషధాన్ని భారత్‌లోనూ విడుదల చేయాలనుకుంటోంది .

ఈ వార్తలు కూడా చదవండి...

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 03:15 AM