వామ్మో.. పసిడి ధరలు.. మరీ ఇంతలా పెరిగాయేంటి!
ABN , Publish Date - Jan 25 , 2026 | 06:51 AM
భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నడుమ దేశంలో పసిడి, వెండి ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: బంగారం, వెండి ధరలు రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, బలహీనపడుతున్న రూపాయి విలువ, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు వెరసి ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శనివారం పసిడి, వెండి ధరలు మరోసారి భగ్గుమన్నాయి. మేలిమి బంగారం ధర రూ.3 వేల మేర, కిలో వెండి ధర రూ.5 వేల మేర పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం 6.00 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ.1,60,260గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,46,900కు ఎగబాకింది. విజయవాడ, వైజాగ్ నగరాల్లో కూడా ఇదే రేటు ఉంది (Gold, Silver Rates on Jan 25).
ఇక కిలో వెండి ధర ప్రస్తుతం రూ.3,65,000 వద్ద తచ్చాడుతోంది. వైజాగ్, విజయవాడల్లో దాదాపు ఇదే రేటు కొనసాగుతోంది. ఇక ముంబై, ఢిల్లీల్లో కిలో వెండి ధర అత్యల్పంగా రూ.3,35,000 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్స్ 24 క్యారెట్ బంగారం ధర రూ.4982 డాలర్ల వద్ద, ఔన్స్ వెండి ధర 103 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని కూడా మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి:
బడ్జెట్ 2026.. పన్నుల తగ్గింపుపైనే ఆశలు..!
కేంద్ర బడ్జెట్ 2026: తొలి ప్రసంగం నుంచి హల్వా సాంప్రదాయం వరకు.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..