Share News

ఉద్యోగులకు అమెజాన్ షాక్.. ఈసారి 14 వేల జాబ్‌లు..

ABN , Publish Date - Jan 23 , 2026 | 09:44 AM

లే ఆఫ్స్ కారణంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్, రిటైల్, ప్రైమ్ వీడియో, హ్యూమన్ రీసోర్సెస్‌ విభాగాలపై ప్రభావం పడనుంది. ఈ విభాగాల్లో పనిచేసే వారి ఉద్యోగాలు పెద్ద మొత్తంలో పోనున్నాయి.

ఉద్యోగులకు అమెజాన్ షాక్.. ఈసారి 14 వేల జాబ్‌లు..
Amazon job cuts

ఇంటర్‌నెట్ డెస్క్: దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగులకు వరుస షాక్‌లు ఇస్తోంది. విడతల వారీగా ఉద్యోగులను తొలగిస్తోంది. ఆ సంస్థ మొత్తం 30 వేల జాబ్స్‌ను తీసివేయాలన్న లక్ష్యంతో ఉన్నట్లు కొన్ని నెలల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గతేడాది 14 వేలకు పైగా ఉద్యోగాలను కంపెనీ తొలగించింది. ఈ ఏడాది కూడా 15 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిశ్చయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అమెజాన్.. గత అక్టోబర్‌లో ఏకంగా 14 వేల వైట్ కాలర్ జాబ్స్‌ను తీసేసిందని రాయిటర్స్ పేర్కొంది.


ఈ ఏడాది కూడా మరో 14 వేల మందికి లేఆఫ్స్ ఇచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నట్టు సమాచారం. అమెజాన్ వెబ్ సర్వీసెస్, రిటైల్, ప్రైమ్ వీడియో, హ్యూమన్ రీసోర్సెస్‌ విభాగాలపై ప్రభావం పడునుంది. ఈ విభాగాల్లో పని చేసే వారి ఉద్యోగాలు పెద్ద మొత్తంలో పోనున్నాయి.

అయితే.. అమెజాన్ అప్పటి పరిస్థితులకు తగ్గట్టు లేఆఫ్స్ ప్లాన్స్‌లో మార్పులు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగానే పెద్ద మొత్తంలో ఉద్యోగాలు పోతున్నాయని అంటున్నాయి.


లేఆఫ్స్‌పై కంపెనీ సీఈఓ ఆండీ జెస్సీ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఆర్థికపరమైన విషయాల వల్ల ఉద్యోగాలు తీసేయడం లేదు. అలాగని ఏఐ కారణంగానూ తొలగించడం లేదు. కంపెనీ సంప్రదాయంలో భాగంగానే లేఆఫ్స్ జరుగుతున్నాయి. ఏటా కొత్త ఉద్యోగులను తీసుకుంటూనే ఉంటాం. అలాంటప్పుడు ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతూ పోతుంది. అందుకే లేఆఫ్స్ తప్పవు’ అని అన్నారు.

కాగా.. 30 ఏళ్లలో ముందెన్నడూ లేనివిధంగా మొదటిసారి 2022లో అమెజాన్ సంస్థ ఏకంగా 27 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఏటా 10వేలకు పైగా ఉద్యోగులకు లేఫ్స్ ఇస్తూనే ఉంది.


ఇవి కూడా చదవండి

సిట్ విచారణకు కేటీఆర్.. తెలంగాణ భవన్‌కు తరలి వస్తున్న పార్టీ శ్రేణులు

ఖాళీ స్థలాలను ప్రజా ప్రయోజనాలకు ఉపయోగిస్తాం..

Updated Date - Jan 23 , 2026 | 11:24 AM