Gold, Silver Rates: జనవరి 1న మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఇక దరువు మొదలైనట్టేనా
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:19 AM
నూతన సంవత్సరం తొలి రోజునే బంగారం ధరలు పెరగడం ప్రారంభించాయి. మరి నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి
ఇంటర్నెట్ డెస్క్: కొత్త సంవత్సరం తొలి రోజునే బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. గత మూడు రోజుల బేరిష్ ట్రెండ్‌కు బ్రేకులు చెబుతూ గురువారం పసిడి ధర స్వల్పంగా పెరిగింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ఉదయం 11.00 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర నిన్నటితో పోలిస్తే స్వల్పంగా పెరిగి రూ.1,35,060కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర కూడా సుమారు రూ.150 మేర పెరిగి రూ.1,23,800కు చేరుకుంది (Gold, Silver Rates on Jan 1).
వెండి ధర మాత్రం మరింతగా తగ్గింది. కిలో వెండి రేటు నిన్నటితో పోలిస్తే సుమారు రూ.1000 మేర తగ్గి రూ.2,38,000కు చేరుకుంది. సుంకాల ప్రభావం, ఫెడ్ వడ్డీ రేటు కోతపై పెరుగుతున్న అంచనాలు, కేంద్ర బ్యాంకుల పసిడి కొనుగోళ్లు వంటివి బంగారానికి మళ్లీ డిమాండ్ పెంచుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే, నేడు ట్రేడింగ్ ఓ మోస్తరుగా ఉండటంతో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కూడా ఆ మేరకు పరిమితమయ్య అవకాశం ఉందని అంటున్నారు. అయితే రోజులు గడిచే కొద్దీ మళ్లీ వీటి ధరలు మళ్లీ పెరగడం పక్కా అని చెబుతున్నారు.
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి (24కే, 22కే, 18కే) ధరలు
చెన్నై: ₹1,36,140; ₹1,24,400; ₹1,03,750
ముంబై: ₹1,35,060; ₹1,23,800; ₹1,01,290
దిల్లీ: ₹1,35,210; ₹1,23,950; ₹1,01,440
కొల్కతా: ₹1,35,060; ₹1,23,800; ₹1,01,290
బెంగళూరు: ₹1,35,060; ₹1,23,800; ₹1,01,290
హైదరాబాద్: ₹1,35,060; ₹1,23,800; ₹1,01,290
విజయవాడ: ₹1,35,060; ₹1,23,800; ₹1,01,290
కేరళ: ₹1,35,060; ₹1,23,800; ₹1,01,290
పూణే: ₹1,35,060; ₹1,23,800; ₹1,01,290
వడోదరా: ₹1,35,110; ₹1,23,850; ₹1,01,340
అహ్మదాబాద్: ₹1,35,110; ₹1,23,850; ₹1,01,340
వెండి ధరలు
చెన్నై: ₹2,56,000
ముంబై: ₹2,38,000
దిల్లీ: ₹2,38,000
కొల్కతా: ₹2,38,000
బెంగళూరు: ₹2,38,000
హైదరాబాద్: ₹2,56,000
విజయవాడ: ₹2,56,000
కేరళ: ₹2,56,000
పూణే: ₹2,38,000
వడోదరా: ₹2,38,000
అహ్మదాబాద్: ₹2,38,000
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి.. కొనుగోలుదారులు మరోసారి ధరలను పరిశీలించగలరు.
ఇవీ చదవండి..