IPO Boom Ahead: 2026లో రూ.4 లక్షల కోట్ల ఐపీఓలు
ABN , Publish Date - Jan 01 , 2026 | 06:30 AM
ప్రైమరీ మార్కెట్లో పబ్లిక్ ఆఫరింగ్‌ల (ఐపీఓ) జోరు ఏటేటా పెరుగుతూ వస్తోంది. 2015లో రూ.13,874 కోట్లుగా నమోదైన ఐపీఓల నిధుల సమీకరణ విలువ...
పాంటోమత్ క్యాపిటల్ అంచనా
ప్రైమరీ మార్కెట్లో పబ్లిక్ ఆఫరింగ్‌ల (ఐపీఓ) జోరు ఏటేటా పెరుగుతూ వస్తోంది. 2015లో రూ.13,874 కోట్లుగా నమోదైన ఐపీఓల నిధుల సమీకరణ విలువ.. గడిచిన పదేళ్లలో 12 రెట్లు పెరిగింది. 2025లోనైతే 103 ప్రధాన కంపెనీలు, 270 ఎస్‌ఎంఈ కంపెనీలు (మొత్తం 373 ఐపీఓలు) కలిసి ప్రైమరీ మార్కెట్ నుంచి మొత్తం రూ.1.95 లక్షల కోట్లు సమీకరించాయి. 2026లో ఐపీఓలు మరింత జోరందుకోనున్నాయని, కంపెనీలు ఆల్‌టైం రికార్డు స్థాయిలో రూ.4 లక్షల కోట్ల వరకు నిధులను సేకరించే అవకాశాలున్నాయని పాంటోమత్ గ్రూప్ నివేదిక అంచనా వేసింది. ఇప్పటికే రూ.1.25 లక్షల కోట్ల విలువైన 96 ఐపీఓలు సెబీ ఆమోదం కూడా పొంది.. 2026లో పబ్లిక్ ఆఫర్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
మీ ట్యాలెంట్‌కు పరీక్ష.. ఈ ఫొటోల్లోని ఐదు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి