New Year Celebrations: విజయవాడలో న్యూఇయర్ జోష్..
ABN , Publish Date - Dec 31 , 2025 | 09:32 PM
విజయవాడలో న్యూఇయర్ సెలబ్రేషన్స్ ప్రారంభం అయ్యాయి. కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు విజయవాడ ప్రజలు సిద్ధమయ్యారు. న్యూఇయర్ సందర్భంగా నగర వ్యాప్తంగా వివిధ రకాల కార్యక్రమాలు..
అమరావతి, డిసెంబర్ 31: విజయవాడలో న్యూఇయర్ సెలబ్రేషన్స్ ప్రారంభం అయ్యాయి. కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు విజయవాడ ప్రజలు సిద్ధమయ్యారు. న్యూఇయర్ సందర్భంగా నగర వ్యాప్తంగా వివిధ రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మంగళగిరి CK కన్వెన్షన్ వేదికగా BassTown NYE 2026 భారీ ఇండోర్ కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు. అలాగే విజయవాడ పొరంకి మురళీ రిసార్ట్స్‌లో VLB NYE 2026 మెగా సెలబ్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. టాప్ సెలబ్రిటీస్, ఆర్టిస్ట్‌లు ఈ ప్రోగ్రామ్స్‌కు హాజరవుతున్నారు. సుబ్లహ్షిణి, దామిని భట్ల, రాహుల్ సిప్లిగంజ్, శ్రావణ భార్గవి, ధనుంజయ్, సాహితీ చాగంటి లైవ్ షోలు కూడా నగరంలో ఉన్నారు. DJ అనన్య అదోగ్రా, VDJ అకిరా హై ఎనర్జీ సెట్స్‌తో న్యూ ఇయర్ కౌంట్‌డౌన్ ప్రారంభించారు బెడజవాడ ప్రజలు. మెరాకీ బ్యాండ్, కార్వాన్ టైమ్స్ లైవ్ బ్యాండ్ పవర్‌ఫుల్ మల్టీ-జానర్ పెర్ఫార్మెన్స్‌లు ఇస్తున్నారు.
ఇక ప్రత్యేక ఆకర్షణగా అక్కీ వాటర్ డ్రమ్స్ విజువల్ షో నిలిచిందనే చెప్పాలి. ప్రీమియం స్టేజ్ డిజైన్, LED విజువల్స్, కాన్సర్ట్-గ్రేడ్ సౌండ్ సిస్టమ్‌లతో నగరం మొత్తం మోతమోగిపోతోంది. డైమండ్ నుంచి సిల్వర్, VVIP నుంచి సిల్వర్ వరకు ప్రత్యేక జోన్లు, క్యూయరేటెడ్ ఫుడ్, పానీయాల కౌంటర్లు ఏర్పాటు చేశారు. 1000 నుంచి మూడు లక్షలకు పైగా న్యూ ఇయర్ వేడుకల టికెట్స్ విక్రయాలు జరిగాయి. భద్రత, క్రౌడ్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక ఫోకస్‌తో యువత, కుటుంబాలకు అనువైన హై ఎనర్జీ సెలబ్రేషన్ నైట్ నిర్వహిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నగరంలో పోలుసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాత్రి 12గంటలకు బందర్ రోడ్‌లో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కేక్ కట్ చేయనున్నారు.
Also Read:
Saifullla Kasuri: కశ్మీర్‌పై వెనక్కి తగ్గం.. భారత్‌కు పహల్గాం సూత్రధారి సైఫుల్లా కసూరి వార్నింగ్
AP News: ‘స్వార్థంతోనే వైసీపీ దుష్ప్రచారం..’
New Year Gift For Tribal Women: గిరిజన మహిళలకు ఉప ముఖ్యమంత్రి పవన్ నూతన సంవత్సర కానుక