Share News

New Year Gift For Tribal Women: గిరిజన మహిళలకు ఉప ముఖ్యమంత్రి పవన్ నూతన సంవత్సర కానుక

ABN , Publish Date - Dec 31 , 2025 | 09:10 PM

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో సికిల్ సెల్ ఎనేమియా బాధితుల కోసం అతి త్వరలో అరకులో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు కానుంది. దాతల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా బ్లడ్ బ్యాంక్ భవన నిర్మాణం జరగనుంది.

New Year Gift For Tribal Women: గిరిజన మహిళలకు ఉప ముఖ్యమంత్రి పవన్ నూతన సంవత్సర కానుక
New Year Gift For Tribal Women

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి చొరవతో సికిల్ సెల్ ఎనేమియా బాధితుల కోసం అతి త్వరలో అరకులో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు కానుంది. దాతల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా బ్లడ్ బ్యాంక్ భవన నిర్మాణం జరగనుంది. గతంలో కురిడీ మాటా మంతి కార్యక్రమంలో ఓ గిరిజన మహిళ తమ సమస్యను ఉపముఖ్యమంత్రికి వివరించారు. దీంతో వైద్య నిపుణుల సూచనలతో బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు డిప్యూటీ సీఎం సన్నద్ధం చేశారు.


అరకు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో బ్లడ్ బ్యాంక్ భవనం ఏర్పాటు కానుంది. గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుకగా నిర్మించనున్న ఈ బ్లడ్ బ్యాంకు భవనంలో అవసరాలకి అనుగుణంగా రక్తం నిల్వ చేసుకునేందుకు వీలుగా అత్యాధునిక సౌకర్యాలు ఉండనున్నాయి. పవన్ కళ్యాణ్ చొరవతో దాతల సహకారంతో నిర్మించనున్న ఈ భవనం అరకు ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానం కానుంది.


ఇవి కూడా చదవండి

ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్..

వధువుతో పాటు స్నేహితులు కూడా ఏడడుగులు.. ఫన్నీ వీడియో వైరల్..

Updated Date - Dec 31 , 2025 | 09:20 PM