Share News

Silver Seen Crossing 100 Dollars: 100 డాలర్లకు వెండి

ABN , Publish Date - Jan 01 , 2026 | 06:27 AM

2025లో బులియన్‌ ఇన్వెస్టర్లకు పసిడి, వెండి భారీ లాభాలు పంచాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రామాణిక వడ్డీ రేట్ల తగ్గింపు, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా సుంకాల వడ్డింపులు, సరఫరా...

Silver Seen Crossing 100 Dollars: 100 డాలర్లకు వెండి

2025లో బులియన్‌ ఇన్వెస్టర్లకు పసిడి, వెండి భారీ లాభాలు పంచాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రామాణిక వడ్డీ రేట్ల తగ్గింపు, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా సుంకాల వడ్డింపులు, సరఫరా అవాంతరాలు, ఆయా దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటుండటం వీటి ధరల ర్యాలీకి కారణమయ్యాయి. 2025లో దేశీయంగా బంగారం ధర 76ు పెరగగా.. వెండి ఏకంగా 170ు వరకు ఎగబాకింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర డిసెంబరు 26న ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.1,42,300కు చేరగా.. డిసెంబరు 30న కిలో వెండి రూ.2,41,000 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ 2025లో 2,657 డాలర్ల మేర (71ు) పెరిగింది. డిసెంబరు 26న 4,550 డాలర్ల వద్ద ఆల్‌టైం రికార్డును నమోదు చేసింది. వెండి సైతం 29.57 డాలర్ల్లు (182.82 శాతం) పుంజుకుంది. డిసెంబరు 29న 83.63 డాలర్ల వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. విలువైన లోహాల ధరలు మున్ముందు మరింత ఎగబాకవచ్చని ఇప్పటికే పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేశాయి. 2026 డిసెంబరు నాటికి ఔన్స్‌ బంగారం 5,055 డాలర్లకు చేరుకోవచ్చని జేపీ మోర్గాన్‌ అంచనా వేసింది. డిమాండ్‌కు తగిన స్థాయిలో సరఫరా లేని కారణంగా ఔన్స్‌ వెండి 2026లో 100 డాలర్ల మార్క్‌ను దాటవచ్చన్న అంచనాలున్నాయి.

ఇవి కూడా చదవండి

మీ ట్యాలెంట్‌కు పరీక్ష.. ఈ ఫొటోల్లోని ఐదు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి

విజయవాడలో న్యూఇయర్ జోష్..

Updated Date - Jan 01 , 2026 | 06:27 AM