2026 Morgan Stanley Forecast : బుల్ ట్రెండ్‌లో 1,00,000
ABN , Publish Date - Jan 01 , 2026 | 06:34 AM
వచ్చే ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లో పరిస్థితులు మెరుగుపడవచ్చని దేశీయ, అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. 2025లో ఒకే అంకెకు పరిమితమైన సూచీల ప్రతిఫలాలు..
2026లో సెన్సెక్స్ వృద్ధిపై మోర్గాన్ స్టాన్లీ అంచనా
వచ్చే ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లో పరిస్థితులు మెరుగుపడవచ్చని దేశీయ, అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. 2025లో ఒకే అంకెకు పరిమితమైన సూచీల ప్రతిఫలాలు.. 2026లో రెండంకెలకు చేరుకోవచ్చంటున్నాయి. వచ్చే ఏడాది డిసెంబరు చివరినాటికి సెన్సెక్స్, నిఫ్టీ 11-26ు మేర రిటర్నులు పంచవచ్చని అంచనా వేశాయి. దేశీయంగా బలమైన ఆర్థిక మూలాలు, విధానపరమైన సడలింపులు, పుంజుకుంటున్న కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు ఇందుకు దోహదపడనున్నాయని సంస్థలు అభిప్రాయపడ్డాయి. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ, వాణిజ్య అనిశ్చితులు కూడా తగ్గుముఖం పట్టినట్లయితే మార్కెట్ మరింత జోరందుకోవడం ఖాయమంటున్నాయి. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం, ఆర్‌బీఐ పరపతి విధానం, ఫెడ్ రేట్లు మన సూచీల గమనాన్ని ప్రభావితం చేయనున్నాయని తమ నివేదికల్లో పేర్కొన్నాయి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు హెచ్‌ఎ్‌సబీసీ, గోల్డ్‌మన్ శాక్స్ ఇప్పటికే మన మార్కెట్ రేటింగ్‌ను ఓవర్ వెయిట్‌కు అప్‌గ్రేడ్ చేశాయి.
2026 చివరికి సూచీల
వృద్ధిపై అంచనాలు
మోర్గాన్ స్టాన్లీ
సెన్సెక్స్ వృద్ధి (%)
బుల్ ట్రెండ్ 1,07,000 26
బేస్ ట్రెండ్ 95,000 12
బేరిష్ ట్రెండ్ 76,000 -10
సంస్థ నిఫ్టీ వృద్ధి (ు)
నోమురా 29,300 13
గోల్డ్‌మన్ శాక్స్ 29,000 12
ఎంకే గ్లోబల్ 29,000 12
సెన్సెక్స్ వృద్ధి (%)
హెచ్‌ఎ్‌సబీసీ 94,000 11
కోటక్ సెక్యూరిటీస్
నిఫ్టీ వృద్ధి (%)
బుల్ ట్రెండ్ 32,032 23.5
బేస్ ట్రెండ్ 29,120 12
బేరిష్ ట్రెండ్ 26,208 -1
యాక్సిస్ సెక్యూరిటీస్
నిఫ్టీ వృద్ధి (%)
బుల్ ట్రెండ్ 29,500 14
బేస్ ట్రెండ్ 28,100 8
బేరిష్ ట్రెండ్ 24,000 -7
ఇవి కూడా చదవండి
మీ ట్యాలెంట్‌కు పరీక్ష.. ఈ ఫొటోల్లోని ఐదు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి