Share News

Gold, Silver Rates Jan 20: వామ్మో.. గోల్డ్, సిల్వర్ రేట్స్.. ఇంతలా పెరిగాయేంటి!

ABN , Publish Date - Jan 20 , 2026 | 06:44 AM

ట్రంప్ సుంకాల దెబ్బకు సోమవారం బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి. మరి భారత్‌లో ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold, Silver Rates Jan 20: వామ్మో.. గోల్డ్, సిల్వర్ రేట్స్.. ఇంతలా పెరిగాయేంటి!
Gold, Silver Rates Jan 20

ఇంటర్నెట్ డెస్క్: గ్రీన్‌‌లాండ్‌ను సొంతం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు ఐరోపా దేశాలపై విధించిన 10 శాతం సుంకం మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. బంగారం, వెండి ధరలు ఒక్కసారి పెరిగాయి. సోమవారం పసిడి ధర రూ.2 వేల మేర పెరగ్గా వెండి ధర రూ.8 వేల మేర ఎగబాకింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం (జనవరి 20) ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్‌ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,250గా ఉంది. 22 క్యారెట్ ఆర్నమెంటల్ పసిడి ధర రూ. 1,34,060కు చేరింది. చెన్నైలో అత్యధికంగా 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.1,46,740కు చేరింది (Gold, Silver Rates Jan 20).

దేశంలో వెండి ధర కూడా చుక్కలను తాకుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర ఏకంగా రూ.3.18 లక్షలకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధర ఇదే స్థాయిలో కొనసాగుతోంది. ముంబైలో అత్యల్పంగా కిలో వెండి రూ.3,05,100 వద్ద ట్రేడవుతోంది.


ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి (24కే, 22కే) ధరలు

  • చెన్నై: ₹1,46,740; ₹1,34,510;

  • ముంబై: ₹1,46,250; ₹1,34,060;

  • న్యూఢిల్లీ: ₹1,46,400; ₹1,34,210;

  • కోల్‌కతా: ₹1,46,250; ₹1,34,060;

  • బెంగళూరు: ₹1,46,250; ₹1,34,060;

  • హైదరాబాద్: ₹1,46,250; ₹1,34,060;

  • విజయవాడ: ₹1,46,250; ₹1,34,060;

  • కేరళ: ₹1,46,250; ₹1,34,060;

  • పుణె: ₹1,46,250; ₹1,34,060;

  • వడోదరా: ₹1,46,300; ₹1,34,110;

  • అహ్మదాబాద్: ₹1,46,300; ₹1,34,110;

వెండి ధరలు..

  • చెన్నై: ₹3,18,100

  • ముంబై: ₹3,05,100

  • న్యూఢిల్లీ: ₹3,05,100

  • కోల్‌కతా: ₹3,05,100

  • బెంగళూరు: ₹3,05,100

  • హైదరాబాద్: ₹3,18,100

  • విజయవాడ: ₹3,18,100

  • కేరళ: ₹3,18,100

  • పుణె: ₹3,05,100

  • వడోదరా: ₹3,05,100

  • అహ్మదాబాద్: ₹3,05,100

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవీ చదవండి:

భారత్ వృద్ధి రేటు 7.3 శాతం.. ఐఎమ్ఎఫ్ అంచనా

మార్కెట్‌ను ముంచిన టారిఫ్‌ భయాలు

Updated Date - Jan 20 , 2026 | 07:12 AM